‘సర్‌ప్రైజ్‌’ ఎప్పుడో రావాల్సిందట… సమంతకి వెళ్లిపోయింది!

‘రాబిన్‌హుడ్‌’ (Robinhood)  టీమ్‌ ఊరించి ఊరించి రిలీజ్‌ చేసిన సర్‌ప్రైజ్‌.. ‘అదిదా సర్‌ప్రైజ్‌’ సాంగ్‌. నిజానికి ఈ సర్‌ప్రైజ్‌ తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడు కాదు నాలుగేళ్ల క్రితం రావాల్సిందట. అప్పుడు వివిధ కారణాల వల్ల ఆగిపోయి ఇప్పుడు వచ్చింది. ఈ విషయాన్ని ‘రాబిన్‌హుడ్‌’ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌ (Y .Ravi Shankar) చెప్పారు. నితిన్‌ (Nithiin) – శ్రీలీల (Sreeleela) ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాబిన్‌హుడ్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో భాగంగా సర్‌ప్రైజ్‌ గురించి సర్‌ప్రైజింగ్‌ విషయాన్ని చెప్పుకొచ్చారాయన.

Ketika Sharma

‘రాబిన్‌హుడ్‌’ సినిమాలోని ‘అదిదా సర్‌ప్రైజు..’ పాట ఇప్పుడు ఎంత వైరల్‌ అవుతోందో మీకు తెలిసిందే. కేతిక (Ketika Sharma) అందాలు, హుక్‌ స్టెప్పు మీద వచ్చిన కాంట్రవర్శీ ఇలా ఒక్కటేంటి చాలా విషయాల వల్ల ఆ పాట హైలైట్‌ అవుతూ వస్తోంది. అయితే కేతిక మెస్మరైజింగ్‌ మూమెంట్స్‌ని మనం ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనే చూసేవాళ్లమట. అందులో ‘ఉ అంటావా మామా ఊఊ అంటావా..’ మాట ఉంది కదా.. అందులో తొలుత కేతిక శర్మనే తీసుకుందాం అనుకున్నారట.

‘అది దా సర్‌ప్రైజ్‌’ పాటతో కేతిక శర్మ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెపన్పిన ఆయన. ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ కోసం సమంత (Samantha) కంటే ముందు కేతికను కలవాలనుకున్నాం అని చెప్పారు. కానీ, అప్పుడు ఏదో కారణం వల్ల మిస్‌ అయ్యామని, మళ్లీ ఇన్నేళ్లకు ఆమెతో సినిమా చేసే అవకాశం వచ్చిందని చెప్పారాయన. ఆ రోజుల్లో సమంత ముందు చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించినా కేతిక పేరు బయటకు రాలేదు.

నిజానికి ‘ఉ అంటావా.. ఊఊ అంటావా’ పాట లిరిక్‌, వాయిస్‌తో పాటు సమంత వల్ల కూడా హిట్టయ్యింది. ఆ సమయానికి ఆమె పర్సనల్‌ లైఫ్‌ కారణంగానే హిట్టయింది. మరి కేతిక ఒకవేళ ఆ పాట చేసి ఉంటే ఎలా ఉండేదో మరి. అల్లు అర్జున్‌ (Allu Arjun) – కేతిక జోడీ అప్పటికే ఓ ఓటీటీ యాడ్‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయమే.

పవన్ కళ్యాణ్ తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus