ఆ విషయంలో బాహుబలినే మించిపోయిన కె.జి.ఎఫ్..?

తెలుగు సినిమా బిజినెస్ 60కోట్ల నుండీ 70 కోట్ల రేంజ్లో మాత్రమే ఉన్న రోజుల్లో.. ‘బాహుబలి'(సిరీస్) వల్ల అది 100కోట్లకు పైగా చేరుకుంది. ఇక డిజిటల్ రైట్స్ పరంగా కూడా ‘బాహుబలి2’ అప్పట్లో చరిత్ర సష్టించింది. ఏకంగా ‘బాహుబలి2’ కి అన్ని భాషలు కలుపుకుని 52 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. ఆ చిత్రం రికార్డును మరే పాన్ ఇండియా చిత్రం కూడా ఇప్పట్లో టచ్ చేసే అవకాశం లేదు కనీసం దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు అని అంతా భావించారు.

కానీ ఇప్పుడు ఆ రికార్డు ను బ్రేక్ చేసింది ‘కె.జి.ఎఫ్2’. అవును అన్ని భాషలు కలుపుకుని ‘కె.జి.ఎఫ్2’ చిత్రానికి ఏకంగా 55 కోట్ల బిజినెస్ జరిగింది. ఏకంగా ‘బాహుబలి2’ రికార్డు నే బ్రేక్ చెయ్యడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ చిత్రానికి అన్ని భాషలు కలుపుకుని 18 కోట్ల బిజినెస్ జరిగింది. అప్పటికి కన్నడ సినిమాల్లో ఇదే పెద్ద రికార్డు అని చెప్పాలి. మన తెలుగు సినిమాల్లో స్టార్ హీరోల సినిమాలకు అంతకు మించే ఉంటున్నాయి.

‘సైరా’ ‘సాహో’ చిత్రాలకు అంతకు మించే దక్కాయి. అయితే ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ చిత్రం అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అవ్వడం.. అందులోనూ అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం ఎక్కువ మంది వీక్షించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చెయ్యడంతో .. ఇప్పుడు సెకండ్ పార్ట్ కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus