Yash: KGF2 న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్!

సంక్రాంతికి రావల్సిన పాన్ ఇండియా సినిమాలు మళ్లీ ఒక్కసారిగా వాయిదా పడిన విషయం తెలిసిందే. RRR సినిమా తోపాటు రాధే శ్యామ్ కూడా మళ్లీ సమ్మర్ లో వచ్చే అవకాశం ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే అంతకంటే ముందుగానే ఏప్రిల్ నెలలో KGF 2 రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఇక ఆ సమయంలో కన్నడ సినిమా వస్తుందా లేదా అనే సందేహాలు కూడా చాలానే వచ్చాయి.

ఇక ఈ తరుణంలో చిత్ర యూనిట్ సభ్యులు హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఏప్రిల్ 14వ తేదీన కచ్చితంగా KGF చాప్టర్ 2 ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు. అందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. KGF చాప్టర్ 1 అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న కన్నడ సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా హిందీ లో సినిమాకు మంచి కలెక్షన్స్ రాగా రెండవ బాగంపై ఇప్పుడు అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటీనటులు నటిస్తున్నారు. అంతేకాకుండా రెండవ భాగంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ ప్రధాన విలన్ గా నటించిన విషయం తెలిసిందే. తప్పకుండా సినిమా అంచనాలకు మించి ఉంటుంది అని ఇప్పటికే దర్శకుడు అనేక రకాల ఇంటర్వ్యూలలో తెలియజేశాడు.

ఫైనల్ గా ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఈ డేట్ విషయంలో అయితే ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు. కానీ ఆ సమయంలో RRR సినిమా తో పాటు విజయ్ బీస్ట్ సినిమా కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏ సినిమాతో పోటీ లేకుండా ఒక వారం అటుఇటుగా కేజిఎఫ్ చాప్టర్ 2 వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus