KGF Child Artist: హీరోలు కూడా స్టన్ అయ్యేలా ఉన్నాడుగా..!

ఇండియా ని షేక్ చేసిన సౌత్ ఇండియన్ సినిమాలలో ఒకటి కేజీఎఫ్ సిరీస్. బాహుబలి సిరీస్ కి పాన్ ఇండియా రేంజ్ లో ప్రతీ భాషలో ఛాలెంజ్ విసిరిన చిత్రమిది. కేవలం థియేటర్స్ లోనే కాదు, ఓటీటీ లో కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎగబడి చూసారు. హీరోయిజం కి సరికొత్త నిర్వచనం తెలిపిన సినిమా. ఇక తెలుగు లో కూడా ఈ సినిమాకి మాములు స్థాయిలో వసూళ్లు రాలేదు.

మొదటి పార్ట్ కి 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి కానీ, రెండవ పార్ట్ కి తెలుగు లో వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఒక డబ్బింగ్ సినిమాకి టాలీవుడ్ ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఇక ఈ చిత్రం లో నటించిన ప్రతీ ఒక్కరు కూడా మన తెలుగు ఆడియన్స్ కి బాగా సుపరిచితమయ్యారు, ఇప్పట్లో వీరిని ఎవరూ మర్చిపోలేరు.

ఇకపోతే ఈ సినిమాలో హీరో చిన్నప్పటి పాత్ర పోషించిన అబ్బాయి గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇతని పేరు అన్మోల్ విజయ్ భక్తల్, కేజీఎఫ్ సిరీస్ కి ముందు ఇతను ఎలాంటి సినిమా చెయ్యలేదు. ఈ చిత్రం తోనే ఎంట్రీ ఇచ్చాడు, చిన్నతనం లోనే అద్భుతమైన హీరోయిజం పండించిన ఈ కుర్రాడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన అబ్బాయి.

ఇతను ఇప్పుడు సోషల్ మీడియా లో కూడా ఉన్నాడు, నిన్న గాక మొన్న విడుదల అయ్యినట్టు అనిపిస్తున్న కేజీఎఫ్ పార్ట్ 1 వచ్చి దాదాపుగా 5 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఈ 5 ఏళ్లలో ఈ కుర్రాడిలో ఫిజిక్ లో చాలా మార్పులు వచ్చాయి. చూసేందుకు ఊర నాటు మాస్ హీరో లాగ అనిపిస్తున్నాడు. ఇప్పటికిప్పుడు ఇతనిని హీరోగా పెట్టి మంచి సినిమా చేసేయొచ్చు, ఆ రేంజ్ లో ఉన్నాడు. (KGF Child Artist ) అతని లేటెస్ట్ ఫోటో మీరు కూడా చూసేయండి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus