ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో రీరిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి నెల 3వ తేదీన కేజీఎఫ్ మూవీ రీరిలీజ్ కానుందని తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా రీరిలీజ్ కు సంబంధించి మరింత స్పష్టత రానుందని సమాచారం అందుతోంది. శ్రీనిధిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే కేజీఎఫ్1 2018 సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ కాగా విడుదలైన ఐదేళ్లకే రీరిలీజ్ చేయడం సరైన నిర్ణయం కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాను రీరిలీజ్ చేసినా ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ రావడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్1 సినిమా కన్నడ సినిమాల రేంజ్ ను ఊహించని స్థాయిలో పెంచిందనే సంగతి తెలిసిందే.
యశ్ ప్రస్తుతం టాక్సిక్ అనే క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. (KGF) కేజీఎఫ్2 సినిమా విడుదలైన తర్వాత యశ్ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే ఈ దర్శకుడు సలార్2 సినిమాతో పాటు జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా మొదట మొదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది.
సలార్1 విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించిన నేపథ్యంలో తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి అలాంటి విమర్శలు రాకుండా ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ ఇండస్ట్రీ హిట్లను సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉండటం గమనార్హం.