2018 లో వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది. రాకింగ్ స్టార్ యష్.. పార్ట్ 1లో ఏ రేంజ్లో అలరించాడో.. పార్ట్ 2 లో కూడా అదే స్థాయిలో అలరిస్తాడని అంతా భావిస్తున్నారు.
టీజర్, ట్రైలర్, పాటలు వంటివి సినిమా పై అంచనాల్ని రెట్టింపు చేసాయి అనే చెప్పాలి. దాంతో ఈ చిత్రానికి అదిరిపోయే లెవెల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు లెవల్లో థియేట్రికల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ.
ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 25.00 cr |
సీడెడ్ | 12.00 cr |
ఉత్తరాంధ్ర | 10.00 cr |
ఈస్ట్ | 06.00 cr |
వెస్ట్ | 05.00 cr |
గుంటూరు | 07.00 cr |
కృష్ణా | 06.00 cr |
నెల్లూరు | 03.00 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 74.00 cr |
‘కె.జి.ఎఫ్2’ చిత్రానికి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓ డబ్బింగ్ సినిమాకి ఇంత బిజినెస్ జరగడం ఇదే మొదటి సారి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు బుకింగ్స్ అదిరిపోయాయి. కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ నమోదవుతాయి. కానీ ఇంత పెద్ద మొత్తాన్ని ‘కె.జి.ఎఫ్2’ రాబడుతుందా అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ ఈ మూవీ అంత కలెక్ట్ చేయలేక నష్టాల్ని మిగిలిస్తే..
‘హోంబెల్ ఫిలిమ్స్’ వారు ప్రభాస్ తో చేస్తున్న ‘సలార్’ మూవీ థియేట్రికల్ హక్కుల్లో అడ్జస్ట్ చేస్తామని నిర్మాతలు బయ్యర్లకి హామీ ఇచ్చారు. అందుకే బయ్యర్లు అంత ధీమాగా భారీ మొత్తం పెట్టి ఈ చిత్రం హక్కులని కొనుగోలు చేసారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!