KGF2 Collections: తెలుగులో మొదటి రోజు ఆ రికార్డు కొట్టడం గ్యారెంటీ..!

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఆ మూవీలో హీరో యష్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మాస్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పింది ఆ మూవీ. ఆ మూవీకి సీక్వెల్ రెడీ అవుతుంది అని తెలిసినప్పటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే ‘కె.జి.ఎఫ్2’ కి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

Click Here To Watch NOW

తెలుగు రాష్ట్రాల్లో కూడా బయ్యర్స్ ఈ మూవీని భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేశారు. తెలుగులో ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే ఏకంగా రూ.75 కోట్లు షేర్ ను రాబట్టాలి. ఈరోజు అనగా ఏప్రిల్ 14 న విడుదలైన ‘కె.జి.ఎఫ్ 2’ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఎలివేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయని, క్లైమాక్స్ పోర్షన్ ఇంకాస్త బాగా డిజైన్ చేసి ఉంటే బాగుణ్ణు అంటూ కామెంట్లు వినిపించినా బుకింగ్స్ మాత్రం భారీగా నమోదవుతున్నాయి.

ఇక మొదటి రోజు ‘కె.జి.ఎఫ్2’ చిత్రం తెలుగులో ఎంత కలెక్ట్ చేయొచ్చు అనే డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం.. మొదటి రోజు ‘కె.జి.ఎఫ్2’ చిత్రం రూ.19 కోట్ల వరకు షేర్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయట.పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీకి ఎక్స్ట్రా షోలు, థియేటర్లు యాడ్ చేశారు.దానికి తోడు ఆఫ్ లైన్ టికెట్ రేట్స్ వంటివి కూడా తోడైతే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బింగ్ సినిమాల్లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన మూవీగా ‘కె.జి.ఎఫ్2’ రికార్డులకెక్కడం ఖాయంగా కనిపిస్తుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus