KGF2 OTT: ఆర్ఆర్ఆర్ కు ముందే కేజీఎఫ్2 వస్తుందా?

యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన కేజీఎఫ్2 బాక్సాఫీస్ వద్ద నయా రికార్డులు క్రియేట్ చేస్తూ మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేజీఎఫ్2 సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగగా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా కేజీఎఫ్2 సినిమా గురించే చర్చ జరుగుతూ ఉండటం గమనార్హం. ప్రశాంత్ నీల్ టేకింగ్ అద్భుతంగా ఉందని నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Click Here To Watch NOW

అయితే కేజీఎఫ్2 ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి తాజాగా క్లారిటీ వచ్చింది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది. బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో ఈ సినిమా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మే 13వ తేదీ నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

కేజీఎఫ్ ఫ్యాన్స్ కు ఇది ఒకవిధంగా శుభవార్త అనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రచారం జరుగుతుండగా కేజీఎఫ్2 సినిమా మాత్రం నెలరోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ కు ముందే కేజీఎఫ్2 స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. అయితే కేజీఎఫ్2 ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది.

కేజీఎఫ్2 కలెక్షన్ల విషయంలో మేకర్స్ సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో డబ్బింగ్ సినిమాలలో చాలా సినిమాలు తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచాయి. కానీ కేజీఎఫ్2 సినిమా మాత్రం భారీ అంచనాలతో విడుదలై ఆ అంచనాలను అందుకుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus