ఎంత పెద్ద సినిమా అయినా దర్శకుడి ఆలోచన చాలా ముఖ్యం…అంటే కాదు…దర్శకత్వంలో పట్టు ఉన్న దర్శకుల్లో మన వీవీ వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…ఇదిలా ఉంటే ఇప్పుడు వినాయక్ ప్రతిష్టాత్మక చిరంజీవి 150వ సినిమాకి దర్శకత్వం వహోస్టున్నాడు….అయితే అదే క్రమంలో ఈ సినిమా షూటింగ్ వినాయక్ లేకుండానే జరిగిపోతుంది…ఇంతకీ విషయం ఏమిటంటే….చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ విడుదల తేదీ దగ్గర పడటంతో…హడావిడి మొదలయింది…చాల్ తక్కువ సమయం ఉండడంతో మిగిలిన సన్నివేశాల షూటింగ్ కోసం మెగా కాంపౌండ్ మరో కొత్త షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది అన్న వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న నేపధ్యంలో మరొక యూనిట్ తో నాగార్జున సాగర్ దగ్గర కూడ ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈసినిమా యూనిట్ రెండు విభాగాలుగా విడిపోయి ఎవరి యూనిట్ షూటింగ్ లను వారు అత్యంత వేగవంతంగా పూర్తి చేయడానికి పరుగులు తీస్తున్నట్లు టాక్. ఈ స్పీడ్ ను అందుకోవడానికి ఒక యూనిట్ షూటింగ్ లో వినాయక్ లేకుండానే షూటింగ్ జరుగుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు హడావిడి చేస్తున్నాయి. దీనితో దర్శకుడు లేకుండా ఇంత ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్ ఏమిటి అని కొందరు బయట వినపడుతున్న ఈ గాసిప్పులను విని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. మరి ఈ నిర్ణయం సినిమా పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.