మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖిలాడి’. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని.. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ‘పెన్ స్టూడియోస్’, ‘ఏ స్టూడియోస్’ బ్యానర్ల పై కోనేరు సత్య నారాయణ నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.ఫిబ్రవరి 11న విడుదలైన ‘ఖిలాడి’ చిత్రం.. మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. దాంతో కలెక్షన్లు సొ సొగా నమోదయ్యాయి.
ఈ కలెక్షన్లు చాలా తక్కువ అని చెప్పలేము కానీ ఓకె అనిపించే విధంగా ఉన్నాయి.ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
3.74 cr
సీడెడ్
1.65 cr
ఉత్తరాంధ్ర
1.43 cr
ఈస్ట్
0.74 cr
వెస్ట్
0.61cr
గుంటూరు
1.01 cr
కృష్ణా
0.56 cr
నెల్లూరు
0.50 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
10.24 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
1.91 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
12.15 cr
‘ఖిలాడి’ చిత్రానికి రూ.22.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.23 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటివారం ఈ చిత్రం రూ.12.15 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.10.85 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 7 వ రోజున కూడా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.0.42 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా పెద్దది కాబట్టి..
రెండో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంటే తప్ప వర్కౌట్ అవ్వదు. ఈరోజు చాలా థియేటర్లలో ‘ఖిలాడి’ చిత్రాన్ని తొలగించి ‘డిజె టిల్లు’ వేసుకోవడం పెద్ద షాకిచ్చే అంశం.