ధడక్ ట్రైలర్‌ వేడుకలో ఏడ్చిన శ్రీదేవి కుమార్తెలు

దక్షిణాది, ఉత్తరాది చిత్ర పరిశ్రమలో కొన్నేళ్లుగా టాప్ హీరోయిన్ గా పేరు గాంచిన హీరోయిన్ శ్రీదేవి.. తన కుమార్తెలు జాన్వీ, ఖుషిలను ఎంతో గ్రాండ్ గా చిత్ర పరిశ్రమకి పరిచయం చేయాలనీ కలలుకంది. పెద్ద కుమార్తెకి మంచి ప్రేమకథని సెలక్ట్ చేసి హిట్ ని పరిచయం చేయాలనీ అనుకుంది. కానీ మృత్యువు ఆమెను తీసుకెళ్ళిపోయింది. జాన్వీ, ఖుషిలు పెద్ద అండని కోల్పోయారు. అయినా తక్కువ కాలంలోనే కన్నీటిని దిగమింగి జాన్వీ తన తొలి సినిమా ధడక్ ని అనుకున్న సమయానికి పూర్తి చేసింది. ధర్మ మూవీస్ బ్యానర్ పై శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇందులో ఇషాన్ హీరోగా నటించారు.

జులై 20 న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ లాంఛ్‌ కార్యక్రమం నేడు జరిగింది. ఈ ఫంక్షన్ కి చిత్ర యూనిట్ తో పాటు అనిల్‌ కపూర్‌, బోని కపూర్‌, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా హాజరైంది. అయితే ఈ శుభసందర్భంలో శ్రీదేవిని తలుచుకుని కపూర్‌ కుటుంబ సభ్యులంతా భావోద్వేగానికి గురయ్యారు. ఖుషీ కపూర్ అయితే తల్లిని తలుచుకుని కన్నీరు పెట్టుకుంది. దీంతో తన చెల్లిని జాన్వీ కపూర్‌ ఓదార్చింది. అక్కచెల్లళ్ళ కన్నీరు పెట్టిన వీడియో శ్రేదేవి అభిమానులను కలిచి వేస్తోంది. శ్రీదేవి బతికి ఉంటే ఈ వేడుక ఇంకెంత వైభవంగా జరిగేదోనని మాట్లాడుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus