Kiara, Sidharth: పెళ్లి కోసం సిద్ధార్థ్‌ – కియారా ఆంక్షలు.. ఏమేం పెట్టారంటే?

బాలీవుడ్‌లోకి మరో స్టార్‌ కపుల్‌ ఒకటి కాబోతోంది. కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న కియారా అడ్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా మరికొన్ని గంటల్లో మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తమ పెళ్లికి వచ్చే అతిథులకు ఆ జంట ఓ రిక్వెస్ట్‌ చేశారని వార్తలొస్తున్నాయి. ఫిబ్రవరి 6న సిద్ధార్థ్‌ మల్హోత్రా – కియారా అడ్వాణీ పెళ్లి జరగబోతోందని వార్తలొస్తున్నాయి. అయితే పెళ్లిపై వారి నుండి ఎక్కడా అధికారిక సమాచారం రాలేదు. అయితే పెళ్లి ఏర్పాట్ల వార్తలు మాత్రం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా – కియారా అడ్వాణీ వివాహం జరగబోతోందని సమాచారం. దీని కోసం సూర్యగఢ్ అనే ఫైవ్ స్టార్ హోటల్‌ సిద్ధం చేశారు. శనివారం నుండే పెళ్లి వేడుకలు మొదలయ్యాయట. అయితే పెళ్లికి హాజరయ్యే బంధు మిత్రులకు నూతన జంట కొన్ని ఆంక్షలు పెట్టారట. తమ పెళ్లికి సంబంధించిన కార్యక్రమాల ఫోటోలు, వీడియోలను ఎట్టిపరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో పోస్టు చేయొద్దని కోరిందని వార్తలొస్తున్నాయి. అంతేకాదు హోటల్ సిబ్బందికి కూడా ఇదే మాట చెప్పిందట.

గతంలో విక్కీ కౌశల్, కట్రినా కైఫ్‌ కూడా తమ పెళ్లి విషయంలో ఇలాంటి విజ్ఞప్తే చేసిన విషయం తెలిసిందే. వివాహ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు కొద్ది మంది సినీ ప్రముఖులకే మాత్రమే ఆహ్వానం అందిందట. టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, రామ్ చరణ్ దంపతులు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్‌ నుండి కరణ్ జోహార్, అశ్విని యార్డి, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, కట్రినా కైఫ్, రకుల్ ప్రీత్ సింగ్‌, జాకీ భగ్నాని, షాహిద్ కపూర్ దంపతులు ఈ పెళ్లికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి తర్వాత ముంబైలో తమ స్నేహితుల కోసం సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారట. దానికిపై గెస్టులతోపాటు మరికొంతమంది సన్నిహితులు, సన్నిహితులు కూడా హాజరవుతారని చెబుతున్నారు. అయితే ఎప్పుడు ఆ వేడుక జరగనుందనే విషయం తెలియాల్సి ఉంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus