కొత్త కారు తీసుకున్న కియారా అద్వానీ…!

కియారా అద్వానీ … ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. ఈమె చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్లే..! ‘కబీర్ సింగ్’ సినిమా అయితే ఏకంగా 300 కోట్ల పైనే వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఈమె కాల్షీట్లు అస్సలు ఖాళీ లేవట. ఓ పక్క సినిమాలు మరోపక్క వెబ్ సిరీస్ లు , అలాగే ఈవెన్ట్ లలో పెర్ఫార్మన్స్ లు .. ఇక కొన్ని మ్యాగ్జైన్ల కోసం హాట్ హాట్ ఫోటో షూట్లు… ఇలా క్షణం ఖాళీ లేకుండా గడుపుతుంది ఈ బ్యూటీ. తెలుగులో కూడా ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.

మహేష్ తో చేసిన ‘భరత్ అనే నేను’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత రాంచరణ్ తో ‘వినయ విధేయ రామా’ చిత్రంలోనూ నటించింది. మళ్ళీ తెలుగులో సినిమా చెయ్యలేదు ఈ బ్యూటీ. మహేష్ భార్య నమ్రత తో ఈమెకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఇక చరణ్ తో కూడా మంచి ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తుంది. ఒకవేళ తెలుగులో సినిమా చేస్తే మహేష్, చరణ్ ల సినిమాలోనే చేస్తాను అని కూడా చెప్పిందట. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ… “ఇ-క్లాస్ 220 డి వైట్ స్పార్క్లింగ్ బెంజ్ కారుని కొనుగోలు చేసిందట.

దీని రేట్ అక్షరాలా 65 లక్షలు అని తెలుస్తుంది. ఈ కారులో ప్రస్తుతం రైడ్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఈ కారుతో పాటు ఈమెకు BMW 5 సిరీస్ కారు కూడా ఉంది. ఇప్పుడు మరో కారును కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే…. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ ‘లక్ష్మీబాంబ్’ తో పాటు .. కరణ్ జోహార్ నిర్మిస్తున్న మరో చిత్రంలో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus