తన లవ్ ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన మహేష్ భామ..!

‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ వంటి చిత్రాలతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది కైరా అద్వానీ. అటు బాలీవుడ్లో కూడా ఈ బ్యూటీ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీగా గడుపుతుంది. వెబ్ సిరీస్, సినిమాలు ఇలా ఎందులో అయినా సరే… నటించాడని సూపర్ స్ట్రాంగ్ గా నిలబడుతుంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కైరా డేటింగ్ చేస్తుందని … ఇద్దరూ కలిసి పార్టీల్లో కనిపించడంతో బాలీవుడ్ మీడియాలో రక రకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

తాజాగా వీటి పై కైరా క్లారిటీ ఇచ్చింది. ఈ విషయం పై కైరా మాట్లాడుతూ… “నేను ఎవర్నీ ప్రేమించడం లేదు. ప్రస్తుతం నేను సింగిల్. నా పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇదే విషయానికి సిద్ధార్థ్ మల్హోత్రా స్పందిస్తూ.. “పని తప్ప నాకు మరేదీ సంతోషాన్ని ఇవ్వదు. కైరాతో కలిసి నటించడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను, పత్రికల్లో వచ్చే రూమర్ల గురించి నాకు తెలీదు. నా జీవితం అందరూ అనుకుంటున్నట్లుగా రంగుల మయం కాదు, నిజ జీవితంలో నాకుండే ఆనందాలు చాలా తక్కువ”.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కైరా ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ లో నటిస్తూ బిజీగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus