తన పెళ్ళి పై షాకింగ్ కామెంట్స్ చేసిన కైరా

టాలీవుడ్ లో సక్సెస్ అయిన ప్రతీ హీరోయిన్ బాలీవుడ్ వైపు వెళ్ళాలనుకుంటుంది. ఒక వేళ అక్కడ కూడా సక్సెస్ అయితే తిరిగి టాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడరు అనేది ఎప్పుడూ వుండే వార్తే. దీనికి ముఖ్య నిదర్శనంగా అతిలోక సుందరి శ్రీదేవి, ఇలియానా లను చెప్పుకోవచ్చు. ఒక వేళ అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ టాలీవుడ్ కో.. కోలీవుడ్ కో రిటర్న్ అవుతారు. ఈ విషయంలో మిల్కీ బ్యూటీ తమన్నాను చెప్పుకోవచ్చు. ఇది మన దక్షణాది నుండీ వెళ్ళే హీరోయిన్ల సంగతి. ఇక బాలీవుడ్ లోకల్ హీరోయిన్స్ మొదట్లోనే సక్సెస్ ను అందుకుంటే మన సౌత్ వైపు అస్సలు ఆసక్తి చూపించరనడంలో సందేహం లేదు.

అయితే ‘ఎం.ఎస్.ధోని’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న కైరా అద్వానీ మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడం విశేషం. తెలుగులో మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయ్యింది కైరా అద్వానీ. ఈ చిత్రం టైములో… మహేష్ భార్య నమ్రత తెలుగులో నటించాలని కోరడంతో ఈ చిత్రంలో నటించిందట. ‘భరత్ అనే నేను’ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది కైరా.

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘వినయ విధేయ రామా’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యింది. అయితే గత కొంత కాలంగా కైరా అద్వానీ డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘వినయ విధేయ రామా’ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఈ విషయం పై స్పందించింది. కైరా అద్వానీ మాట్లాడుతూ.. “నేనెవ్వరితోనూ డేటింగ్ లో లేను.. అయినా నాకు ఎప్పుడో పెళ్ళయ్యిపోయింది. నేను చేసే సినిమాలనే నేను ప్రేమిస్తున్నాను.. సినిమాలనే పెళ్ళి చేసుకున్నా.. అంటూ ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus