Kiara Advani: ప్లాస్టిక్ సర్జరీపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

టాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటించి ఆ తరువాత బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది కియారా అద్వానీ. తాజాగా ఈ బ్యూటీ తనపై జరుగుతోన్న నెగెటివ్ ప్రచారాన్ని తిప్పి కొట్టింది. తన గురించి సోషల్ మీడియాలో రాకరాక నెగెటివ్ కామెంట్స్ వినిపించాయని.. ఒక దశలో ఆ కామెంట్స్ తనకు బాధించాయని కియారా చెబుతోంది. సినిమా తారల జీవితమంటే.. కనిపించే అందమైన జీవితం మాట ఎలా ఉన్నా..

రాకరాక అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుందని కియారా చెబుతోంది. తనపై జరిగిన, జరుగుతోన్న రకరకాల ప్రచారాల గురించి కియారా స్వయంగా మాట్లాడింది. తనను పొగరుబోతు అని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారని చెప్పింది. వారు కోరినప్పుడు ఫోటోలకు ఇవ్వకపోతే ఈ అభిప్రాయాన్ని ఏర్పరుచుకుని.. దాన్నే ప్రచారం చేశారని కియారా చెబుతోంది. ట్విట్టర్ లో తనను తిడుతూ పెట్టే పోస్ట్ ల గురించి స్పందించడానికి కూడా ఏమీ ఉండదని కియారా స్పష్టం చేసింది.

తన అందం గురించి కూడా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపించాయని.. తనొక షోకి అటెండ్ అయ్యాక.. అక్కడ దిగిన ఫొటోలన్నీ వైరల్ అయ్యాయని.. వాటిని చూసి తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారని కియారా వివరించింది. అయితే తను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని కియారా తెలిపింది. సెలబ్రిటీ హోదాను ఆనందించడం మాట పక్కన పెడితే.. సోషల్ మీడియా నుండి వచ్చే నెగెటివ్ కామెంట్స్ ను భరించక తప్పడం లేదని కియారా చెప్పుకొచ్చింది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus