Vijay Deverakonda: శివ నిర్వాణ కొత్త సినిమాలో రౌడీ నాయిక ఆమేనట!

విజయ్‌ దేవరకొండ, కియారా అడ్వాణీ కాంబినేషన్ ఎలా ఉంటుంది. అదిరిపోతుంది కదూ. ఆ మధ్య ఏదో వస్త్ర దుకాణం యాడ్‌లో ఇద్దరి జంట సూపర్‌గా కనిపించింది. అప్పటి నుండి ఈ కాంబో వెండితెరపై పడితే సూపర్‌ అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. ఒకటి రెండుసార్లు ఈ కాంబోపై రూమర్ష్‌ వచ్చినా మెటీరియలైజ్‌ అవ్వలేదు. అయితే ఇప్పుడు అంతా ఓకే అయ్యేలా కనిపిస్తోంది. అవును విజయ్‌ నెక్స్ట్‌ సినిమాలో ఈ కాంబినేషన్‌ చూడొచ్చు అంటున్నారు.

Click Here To Watch

‘లైగర్‌’ తర్వాత గతంలో చెప్పిన కాన్సెప్ట్‌ ప్రకారం… శివ నిర్వాణ చేయాల్సి ఉంది విజయ్‌ దేవరకొండ. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ మీద ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని సమాచారం. శివ నిర్వాణ స్టైల్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. అయితే దీనిపై మధ్యలో రకరకాల పుకార్లు వినిపించాయి. సినిమా ఉండదని, ‘టక్‌ జగదీష్‌’ సినిమా రిజల్ట్‌ నచ్చక సినిమా వద్దనుకున్నారని అన్నారు.

కానీ ఆ సినిమా ఇంకా ఉందని తాజా సమాచారం. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించి శివ నిర్వాణ కాస్ట్‌ అండ్‌ క్రూ ఎంపిక చేసే పనిలో ఉన్నారట. ఈ క్రమంలోనే కథానాయిక ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు కియారా అడ్వానీ అయితే బాగుంటుందని అనుకున్నారట. ప్రస్తుతం ఈ విషయంలో ఆమెతో చర్చలు జరుగుతున్నాయట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే యాడ్ జంట… రీల్‌ జంటగా మారుతుందని సమాచారం. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తుందని సమాచారం.

ఇక విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్‌ కలల ప్రాజెక్ట్ ‘జన గణ మన’లో విజయ్‌ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై అఫీషియల్‌ ఇన్ఫర్మేషన్‌ అయితే లేదు. టాక్స్‌ ప్రకారం అయితే శివ నిర్వాణ సినిమా తర్వాతే విజయ్‌ ‘జన గణ మన’ చేస్తాడట. ఈలోపు పూరి ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేస్తారని అంటున్నారు. ఆ తర్వాత పూరి హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ మొదలుపెడతారని సమాచారం.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus