కియారా లేడీ ఓరియెంటెడ్ సినిమా.. రిలీజ్ కి రెడీ!

కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్లను తెరుచుకోవచ్చని ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చినా.. జనాలు థియేటర్లకు రారనే భయంతో నిర్మాతలు ఇప్పటికీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లను నమ్ముకుంటున్నారు. పైగా ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేస్తుండడంతో నిర్మాతలు కూడా ఓటీటీలకే సినిమాలను అమ్మడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొన్ని మీడియం, లో బడ్జెట్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. నిర్మాతలెవరూ కూడా థియేటర్లపై దృష్టి పెట్టడం లేదు. బడా సినిమాకు కూడా విడుదల కాకుండా వాయిదా పడుతూనే ఉన్నాయి.

ఏదైనా పెద్ద థియేటర్లో వస్తే తప్ప పరిస్థితిని అంచనా వేయలేని విధంగా ఉంది. కానీ ఏ హీరో కూడా ముందుకు రావడం లేదు. హీరోలే వెనకాడుతోన్న సమయంలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఒకటి థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇందు కీ జవానీ’ సినిమాను డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. మరి కియారా సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఏ స్థాయిలో వస్తారో తెలియదు.

యాభై శాతం అమ్మకంతో బిజినెస్ ఎలా జరుగుతుందనేది తెలుసుకోవడానికి ఈ సినిమా కొంతవరకు హెల్ప్ చేస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ రోజున అమెజాన్ లో ‘దుర్గామతి’ అనే మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా రిలీజ్ కానుంది. తెలుగులో అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమాకి రీమేక్ అయిన ఈ సినిమాలో భూమి పెడ్నేకర్ హీరోయిన్ గా నటించింది.


బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus