Kiccha Sudeep : గొప్ప మనస్సు చాటుకున్న కిచ్చ సుదీప్!

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న కిచ్చ సుదీప్ తెలుగులో విలన్ రోల్స్ చేయడంతో పాటు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఈగ సినిమా సుదీప్ కు తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగులో సుదీప్ కు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నా మంచి పాత్రలకు మాత్రమే సుదీప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం. తాజాగా సుదీప్ చేసిన ఒక పనిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. కష్టాల్లో ఉన్న వృద్ధ దంపతులకు అండగా నిలిచి సుదీప్ గొప్ప మనస్సును చాటుకున్నారు.

తల్లిదండ్రులను కన్న కొడుకు అనాథలుగా చేసినా తానున్నానంటూ దొడ్డ పట్టణంలోని శ్రీనివాస్, కమలమ్మ దంపతులకు సుదీప్ ఆసరాగా నిలిచారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడు దివ్యాంగుడు. మరో కుమారుడు మైసూరులో స్థిరపడిన తరువాత తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. బెంగళూరులో ఉన్న ఆస్తిని వీరు అమ్మేసి దొడ్డ పట్టణంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా కమలమ్మ అనారోగ్య సమస్యలతో బాధ పడుతుండగా ఈ విషయం సుదీప్ కు తెలిసింది.

బెంగళూరులో ఉన్న జైన్ ఆస్పత్రిలో కమలమ్మకు చికిత్స చేయించిన సుదీప్ కమలమ్మ, శ్రీనివాస్ లకు సంబంధించిన పూర్తి బాధ్యతను తీసుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ కిచ్చ సుదీప్ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. సుదీప్ కన్నడలో బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. సుదీప్ సినిమా ఇండస్ట్రీలో రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus