కొంతమంది హీరోలు సాయంత్రం 6 అయితే చాలు ప్యాకప్ చెప్పేస్తూ ఉంటారు అని కొంతమంది దర్శకనిర్మాతలు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ‘కొంతమంది నటులు మాత్రం సినిమా కోసం బ్లడ్ పెట్టి మరీ పని చేస్తారు’ అని కూడా వారు చెప్పుకొచ్చారు. ఇలాంటి నటులకు ఓ ఛాలెంజింగ్ రోల్ గురించి చెబితే.. దానికి జీవం పోస్తారు అని వారు అభిప్రాయపడుతుంటారు. బహుశా ఈ కోవకే చెంది ఉంటాడు నటుడు ‘కిక్’ శ్యామ్.
తమిళంలో బాబీ సింహా,విజయ్ సేతుపతి వంటి వారిలానే ఇతను కూడా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసాడు. అక్కడ మంచి పేరు తెచ్చుకున్న తరువాత టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఆల్ టైం హిట్ మూవీ ‘కిక్’ తో ఇతను తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తరువాత ‘కళ్యాణ్ రామ్ కత్తి’ ‘వీర’ ‘ఊసరవెల్లి’ ‘యాక్షన్ 3D’ ‘రేసుగుర్రం’ ‘ఆక్సిజన్’ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల ఇతను ఓ ఛాలెంజింగ్ రోల్ ను ఎంపిక చేసుకున్నాడు.
ఆ పాత్ర ప్రకారం… కళ్ళు చిన్నవిగా కనిపించాలి, వాటి కింద గడ్డలు ఉండాలి. దీనిని గ్రాఫిక్స్ లో మేనేజ్ చేయవచ్చు. మేకప్ టీంకు చెబితే గంటలో ఆ లుక్ లోకి తీసుకెళ్లి పోతారు. కానీ నేచురల్ గా ఉండాలని భావించిన శ్యామ్.. ఏకంగా 9 రోజులు నిద్ర మానేసి ఈ లుక్ లోకి వచ్చాడట. ఆయన లేటెస్ట్ లుక్ ను చూస్తే గుర్తుపట్టలేని విధంగానే కాదు భయపెట్టే విధంగా కూడా కనిపిస్తున్నాడు. ఏమైనా ఇతని డెడికేషన్ కు హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే.