టీవీల్లో, సినిమాల్లో వచ్చే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, హీ మ్యాన్ లను చూసి వారికి ఫ్యాన్స్ అయిన పిల్లలను మనం ఇప్పటివరకు చూసాం. ఆ సూపర్ హీరోల బొమ్మలను గిఫ్ట్ గా కావాలని కోరుకునే వారు బోలెడు మంది. ఇప్పుడు ట్రెండ్ మారింది. బాహుబలి చిత్రంలో వీరాధి వీరుడిగా కనిపించిన ప్రభాస్ ని సూపర్ హీరోగా భావిస్తున్నారు. బాహుబలి బొమ్మలు కావాలని మారాం చేసే పిల్లలు ఈ మధ్య ఎక్కువ అయ్యారు. తాజాగా బాహుబలి చిత్ర బృందం అవాక్కయిన సంఘటన జరిగింది. 11 ఏళ్ల ఆర్యన్ అనే పిల్లవాడు తన పుట్టిన రోజు కేక్ లో బాహుబలి బొమ్మ ఉండాలని పట్టుబట్టాడు.
ఇంకా అటువంటివి తయారు చేయడం లేదని తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. బాహుబలి కేక్ లేనిదే బర్త్ డే చేసుకోనని ఆర్యన్ చెప్పడంతో షాప్ వాళ్ళు అలా తయారు చేసి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకొని బాహుబలి టీమ్ సభ్యులు షాక్ తిన్నారు. యువతలో డార్లింగ్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉందని తెలుసు, బాహుబలి తర్వాత చిన్నారుల్లో ఫాలోవర్స్ పెరిగినందుకు సంతోషంగా ఉందని వారు చెప్పారు. బాహుబలి కంక్లూజన్ కోసం సినీ ప్రియులు ఎలా వెయిటింగ్ చేస్తున్నారో.. అంతకంటే ఎక్కువగా నేటి సూపర్ హీరో బాహుబలి టాయ్స్, గేమ్స్ కోసం పిల్లలు అంతలా ఎదురు చూస్తున్నారని చెప్పటానికి ఈ ఒక్క సంఘటన చాలు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.