కింగ్ నాగార్జున హీరోగా గరుడవేగ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్నితెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ఈ రోజు( ఫిబ్రవరి 16) సికింద్రాబాద్ శ్రీ గణపతి దేవస్థానములో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ సినిమాటోగ్రఫి మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టగా, లీడింగ్ ఎగ్జిబిటర్ సదానంద గౌడ్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా..
కింగ్ నాగార్జున మాట్లాడుతూ – “నిన్ననే హిందీ సినిమా `బ్రహ్మాస్త్ర` షూటింగ్ పూర్తిచేసుకుని వచ్చాను. ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు, రణబీర్ కపూర్, ఆలియా బట్ నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్‌జోహార్ నిర్మిస్తున్నారు. ఈ రోజు సికింద్రాబాద్ శ్రీ గణపతి దేవాలయంలో నా సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ టెంపుల్‌కి రావడం ఇదే మొదటిసారి. చాలా పవర్‌ఫుల్ టెంపుల్ ఎన్నో సంవత్సరాలనుండి ఉంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి పతాకాలపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. టైటిల్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఇలాంటి ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నటించి చాలా రోజులు అయింది. లండన్, ఊటీ, గోవా, హైదరాబాద్‌లో షూటింగ్ జరపనున్నారు“ అన్నారు.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ – “ నాగార్జున గారు హీరోగా నేను దర్శకత్వం వహిస్తున్నమూవీ ఈ రోజు సికింద్రబాద్ గణేష్ టెంపుల్‌లో ముహూర్తం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి మా టీమ్ అందరం చాలా ఎగ్జయిటింగ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్నాం. ఇదొక స్టైలిష్ యాక్షన్ ఫిలిం. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం “ అన్నారు.
ప్రముఖ నిర్మాత పుస్కూర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ – “నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో నేను, సునీల్ నారంగ్, శరత్ మరార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. హైదరాబాద్‌లో పదిరోజుల పాటు షూటింగ్ జరిపి మార్చిలో గోవాలో 15రోజులు షూటింగ్ ప్లాన్ చేశాం. ఆ తర్వాత ఊటీ, లండన్‌లో షూటింగ్ జరుపనున్నాం. వీటితో పాటు సౌత్ కొరియాలో నాలుగు రోజులు షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ మూవీలో భారీ తారాగణం నటించనుంది. నాగార్జున గారి కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది“ అన్నారు.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?