దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్ ఆఫ్ కొత్త’. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. ‘జీ స్టూడియోస్’, ‘వేఫేరర్ ఫిల్మ్స్’ బ్యానర్లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.అభిలాష్ జోషి దర్శకుడు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది.యాక్షన్ ఎపిసోడ్స్, కె.జి.ఎఫ్ రేంజ్ ఎలివేషన్స్ కూడా ఉంటాయనే భరోసా ఇచ్చింది.
ఆగస్టు 24న ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషలో రిలీజ్ కాబోతుంది. ఇక తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 2.00 cr |
సీడెడ్ | 0.65 cr |
ఆంధ్ర(టోటల్) | 1.80 cr |
ఏపీ + తెలంగాణ | 4.45 cr |
‘కింగ్ ఆఫ్ కొత్త’ (King of Kotha) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4 .45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు హిట్ టాక్ వస్తే అది .. పెద్ద కష్టమైన టార్గెట్ ఏమీ కాదనే చెప్పాలి.
ఎందుకంటే దుల్కర్ నటించిన గత చిత్రం ‘సీతా రామం’ తెలుగులో రూ.30 కోట్లకి పైగా షేర్ నమోదు చేసింది. ‘కురుప్’ ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాలు కూడా బాగా కలెక్ట్ చేశాయి.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్