Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

విజయ్ దేవరకొండ,దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో ‘కింగ్డమ్’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చింది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.

Kingdom Collections

జూలై 31న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. అందువల్ల వీకెండ్ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ బాగా డల్ అయ్యాయి. దీంతో 2వ వీకెండ్ పై గట్టిగా ప్రెజర్ పడింది. అయితే 9వ రోజు కూడా ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేసింది లేదు. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 11.32 cr
సీడెడ్ 4.29 cr
ఉత్తరాంధ్ర 3.29 cr
ఈస్ట్ 1.95 cr
వెస్ట్ 1.10 cr
గుంటూరు 1.57 cr
కృష్ణా 1.32 cr
నెల్లూరు 0.88 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 25.72 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.67 cr
మిగిలిన వెర్షన్లు 0.67 cr
ఓవర్సీస్ 9.30 cr
టోటల్ వరల్డ్ వైడ్ 40.36 cr (షేర్)

 

‘కింగ్డమ్’ చిత్రానికి రూ.50.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.52 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజుల్లో ఈ సినిమా రూ.40.36 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.74.8 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.11.64 కోట్లు షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. 3వ వీకెండ్లో భాగంగా ఈ 2 రోజుల్లో గట్టిగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus