విజయ్ దేవరకొండ,దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘కింగ్డమ్’. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ అత్యంత కీలక పాత్ర పోషించారు. అనిరుధ్ సంగీతంలో రూపొందిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలు పెంచాయి. జూలై 31న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.
తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించాయి. అయితే ఆదివారం రోజు ఎందుకో కలెక్షన్స్ మరింత తగ్గాయి అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 9.56 cr |
సీడెడ్ | 3.87 cr |
ఉత్తరాంధ్ర | 2.80 cr |
ఈస్ట్ | 1.78 cr |
వెస్ట్ | 1.02 cr |
గుంటూరు | 1.45 cr |
కృష్ణా | 1.26 cr |
నెల్లూరు | 0.82 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 22.56 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.4 cr |
మిగిలిన వెర్షన్లు | 0.55 cr |
ఓవర్సీస్ | 8.05 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 35.56 cr |
‘కింగ్డమ్’ చిత్రానికి రూ.50.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.52 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.35.56 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.66 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.16.44 కోట్లు షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. ఆదివారం ఎందుకో ఆశించిన స్థాయిలో ఈ సినిమా కలెక్ట్ చేయలేదు. ఈరోజు నుండి ఈ సినిమాకి పెద్ద పరీక్షే. చూడాలి మరి వీక్ డేస్ లో ఏ స్థాయిలో నిలదొక్కుకుంటుందో.