జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కిరాక్ ఆర్పీ ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన అనంతరం మల్లెమాల వారితో ఉన్న మనస్పర్ధల వల్ల జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి బయటకు వచ్చారు.ఇలా ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత మల్లెమాల వారిపై చేసినటువంటి వ్యాఖ్యలు ఎలాంటి వివాదాలకు కారణమయ్యాయో మనకు తెలిసిందే. ఈ విధంగా మల్లెమాల వారి పట్ల కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ మల్లెమాలవారికి సపోర్ట్ చేశారు.
అయితే ఈ వివాదం ముగిసిన తర్వాత కిరాక్ ఆర్పీ హైదరాబాదులో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో రెస్టారెంట్ ప్రారంభించారు.ఈయన నెల్లూరుకు చెందిన వ్యక్తి కావడంతో నెల్లూరు చేపల పులుసు రెస్టారెంట్ పెట్టడం వల్ల ఈయన రెస్టారెంట్ బిజినెస్ ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఇక ఈ రెస్టారెంట్లో వంటకాలన్నీ కూడా కట్టెల పొయ్యి పై చేయడం ప్రత్యేకం.ఇలా ఎంతో రుచికరంగా చేపల పులుసు తయారు చేయడంతో పెద్ద ఎత్తున కస్టమర్లు ఈయన రెస్టారెంట్ ముందు క్యూ కట్టారు.
అయితే ఈ రెస్టారెంట్లో పని చేసే వారి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల కస్టమర్లకు సరిపడా చేపల పులుసు తయారు చేయకపోవడంతో కష్టమర్లు నిరాశగా వెను తిరుగుతున్నారు. దీంతో ఆర్పి కొంతకాలం పాటు తన రెస్టారెంట్ మూత వేసి నెల్లూరుకి వచ్చి ఎంతో అనుభవం ఉన్నటువంటి వంట వారి కోసం వేట మొదలు పెట్టారట. ఇలా చేపల పులుసు తయారు చేయడంలో ఎంతో అనుభవం ఉన్న వారిని హైదరాబాద్ తీసుకెళ్లి వారికి ఉపాధి కల్పించడమే కాకుండా
తన వ్యాపారాన్ని కూడా విస్తరించుకోవాలన్న ఆలోచనలో కిరాక్ ఆర్పీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈయన నెల్లూరుకు రావడంతో తన రెస్టారెంట్ కూడా కొంతకాలం పాటు మూసివేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే మరి కొంతమంది వర్కర్స్ తో ఆయన తన రెస్టారెంట్ ప్రారంభిస్తానని తెలిపారు.
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?