బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ‘రాక్షసుడు’ వంటి డీసెంట్ హిట్ తర్వాత చేసిన సినిమా ‘కిష్కింధపురి’. ఇదొక హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్స్ తోనే భయపెట్టి హారర్ సినిమా ప్రేక్షకులను ఆకర్షించిన ఈ సినిమాని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు.
సెప్టెంబర్ 12న పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ప్రీమియర్ షోలతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ… మొదటి రోజు కంటే 2వ రోజు నుండి ఈ సినిమా బాగా పికప్ అయ్యింది అని చెప్పాలి. అయితే ‘మిరాయ్’ కి ఆదరణ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ‘కిష్కింధపురి’ కలెక్షన్స్ పై కొంత ప్రభావం అయితే పడింది. అయినప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది. ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 3.86 cr |
సీడెడ్ | 0.82 cr |
ఆంధ్ర(టోటల్) | 3.88 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 8.56 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.50 cr |
ఓవర్సీస్ | 0.63 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 9.69 cr (షేర్) |
‘కిష్కింధపురి’ (Kishkindhapuri) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. 8 రోజుల్లో ఈ సినిమాకి రూ.9.69 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ పరంగా రూ.16.38 కోట్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.31 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ రావడం వల్ల ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ ‘మిరాయ్’ కి కూడా సూపర్ హిట్ టాక్ రావడం వల్ల ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్ పై కొంత ప్రభావం అయితే పడింది.అందువల్ల 2వ వీకెండ్ కలెక్షన్స్ కీలకంగా మారాయి అని చెప్పాలి.