Klin Kaara: అమ్మమ్మ, తాతయ్యలతో క్లీంకార.. ఉపాసన హ్యాపీ పోస్ట్‌ చూశారా?

రామ్‌చరణ్‌, ఉపాసనల గారాలపట్టి క్లీంకారను చూద్దామని చాలా రోజుల నుండి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. బిడ్డ జన్మించినప్పటి నుంచి ప్రతి విషయంలో అప్‌డేట్ ఇస్తున్నా.. ఎక్కడా చిన్నారిని చూపించలేదు అనే ఆలోచన అయితే ఉంది. అయితే తాజాగా క్లీంకార ఫస్ట్‌ లుక్‌ కాదు కాదు టీజర్‌ను చూపించారు. అది కూడా స్పెషల్‌ డేనాడు ఫేస్‌ను కాస్త రివీల్‌ చేశారు. అమ్మమ్మ, తాతయ్యలతో కలసి క్లీంకార ఆగస్టు 15న జాతీయ జెండాను ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మెగా వారసురాలు మొదటిసారిగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంది. అమ్మమ్మ- తాతయ్యతో కలిసి త్రివర్ణ పతాకాన్నిఎగరవేసి, జెండా వందనం చేసింది. ఈ మేరకు ఉపాసన సోషల్ మీడియా ద్వారా చేశారు. క్లీంకార ఫస్ట్ ఇండిపెండెన్స్ డే విత్ అమ్మమ్మ- తాతయ్య అని రాసుకొచ్చారు. అమూల్యమైన క్షణాల అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ ఫోటోలో క్లీంకార ఫేస్ సరిగ్గా కనిపించకుండా కవర్ చేశారు. లంగా జాకెట్ వేసుకుని ట్రెడిషనల్ లుక్ ఉంది అని మాత్రం తెలుస్తోంది.

ఇప్పటివరకు రామ్‌చరణ్‌ కానీ, ఉపాసన కానీ, మెగా ఫ్యామిలీ కానీ… ఎవరూ క్లీంకార ఫేస్‌ రివీల్ చేయలేదు. ఉపాసన డిశ్చార్జి సమయంలో ప్రెస్‌ ముందుకు వచ్చినా ఫేస్‌ చూపించలేదు. దీంతో టీజర్‌లా ఆ ఫేస్ కనిపించేసరికి ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతున్నారు. జూన్ 20న రామ్‌చరణ్‌ – ఉపాసనకు పండంటి బిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. ఆ బిడ్డను ద్రావిడ సంస్కృతిలో భాగం కావాల‌ని కోరుకుంటున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చారు. పాప పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగులు ఇవ్వొద్దని కూడా ఆమె కోరారు.

రామ్ చరణ్, ఉపాసన పెళైన 11 ఏళ్ల తరువాత తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు, మెగా ఫ్యాన్స్‌ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు పాపను చూపించడంతో ఇంకా హ్యాపీ ఫీల్‌ అవుతున్నారు. ఆ ఆనందాన్ని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌, పోస్టుల రూపంలో చూపిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus