కొడి రామ‌కృష్ణ గారు త‌న చిత్రాల ద్వారా తెలుగు సినిమా వున్నంత‌కాలం బ్ర‌తికే వుంటారు: కుమార్తే దివ్య దీప్తి

ద‌ర్శ‌కుడిగా న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో శాశ్వ‌తంగా నిలిచిపోయిన శ‌తాధిక ద‌ర్శ‌కుడు కొడి రామ‌కృష్ణ‌.. ఈ పేరు వెండి తెర‌పై ప‌డితే చాలు దియెట‌ర్స్ కి తండోప‌తండాలుగా జ‌నం పోటెత్తేవారు. ఫ్యామిలి చిత్రాలు, కామెడి చిత్రాలు, యాక్ష‌న్ చిత్రాలు, గ్రాఫిక్ చిత్రాలు, గ్రావిటి చిత్రాలు, డెవిల్ చిత్రాలు డెవోష‌న్ చిత్రాలు ఇలా ఏ ద‌ర్శ‌కుడు ట‌చ్ చేయ‌ని అన్ని క‌మ‌ర్షియ‌ల్ జోన‌ర్ చిత్రాలు తీసిక ఏకైక ద‌ర్శ‌క‌మ‌హ‌నుభావుడు కొడి రామ‌కృష్ణ గారు తెలుగు ప్రేక్ష‌కుడిని శారీరకంగా విడిచి రెండు సంవ‌త్స‌రాలు పూర్తియ్యింది.

కొడి రామకృష్ణ గారి కుమార్తే దివ్యదీప్తి మాట్లాడుతూ.. కోడి రామ‌కృష్ణ గారు. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో విడదీయరాని బంధం ఉంది. కేవలం దర్శకుడిగానే కాకుండా వ్యక్తిత్వంతోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఈయన. తెలుగు సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ తో సరికొత్త హంగులు అద్దిన టార్చ్ బేరర్ కోడి రామకృష్ణ గారు. నాటి అమ్మోరు నుంచి నిన్నటి అరుంధతి వరకు ఆయన ఊహ ఒక అద్భుతం.. ఆ ఊహకు ప్రాణం పోయడం కోసం అహర్నిశలు శ్రమించేవారు కోడి రామకృష్ణ గారు. ఒక మనిషి తన జీవిత కాలంలో నిర్వహించిన పని నాణ్యత మాత్రమే ఆ మనిషికి చరిత్రలో స్థానం కల్పిస్తుంది..

అటువంటి కొందరు ప్రతిభావంతులు చరిత్రే సమాజ చరిత్ర అవుతుంది.. తన శతాధిక చిత్రాలతో ప్రేక్షకులను రంజింప చేసి సినీ చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచిన దిగ్దర్శకులు కోడి రామకృష్ణ గారి వర్దంతి నేడు.. వారు భౌతికంగా ఈ లోకం నుండి నిష్క్ర‌మించిన‌ రెండు సంవత్సరాలైనా మా మనోలోకంలో మాత్రం మహారాజులా ఎల్లప్ప్డుడూ జీవిస్తూనే ఉంటారు. ఆయన సృష్టించిన చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఆ స్పూర్తి తోనే పెద్ద కుమార్తెగా ఆయన అడుగు జాడలలో నడుస్తూ వారి దివ్యాసిస్సులతో ఒక మంచి విషయం తో మీ ముందుకు వస్తున్నాం. త్వరలో అన్ని వివరాలూ తెలియజేస్తాను..నాన్నగారి దివ్యస్మృతికి హృదంజలి అర్పిస్తున్నాను. అన్నారు

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus