Kollagottinadhiro Song Review: మొదటి పాట అలా… రెండో పాట ఇలా..!

‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)  నుండి ఇప్పటికే ‘మాట వినాలి’ అనే పాట బయటకు వచ్చింది. అది చిన్న పాటే అయినప్పటికీ బాగానే వైరల్ అయ్యింది. ఇప్పుడు ‘కొల్లగొట్టినాదిరో’ (Kollagottinadhiro) అంటూ రెండో లిరికల్ సాంగ్ ను వదిలారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  స్క్రీన్ ప్రెజెన్స్, నిధి అగర్వాల్ (Nidhhi Agerwal)  గ్లామర్… అలాగే అనసూయ భరద్వాజ్ (Anasuya), పూజిత పొన్నాడ (Poojita Ponnada)..ల కేమియోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.పాట విషయానికి వస్తే.. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి (M. M. Keeravani) కంపోజ్ చేసిన ఈ ‘కొల్లగొట్టినాదిరో’ పాటని మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), రమ్య బెహరా (Ramya Behara), యామిని ఘంటసాల..

Kollagottinadhiro Song Review:

వంటి టాప్ సింగర్స్ పాడటం విశేషంగా చెప్పుకోవాలి. కీరవాణి అందించిన ట్యూన్ కి (Kollagottinadhiro) తగ్గట్టు చంద్రబోస్ లిరిక్స్ అందించాడు. వీరమల్లు(పవన్ కళ్యాణ్), పంచమి(నిధి అగర్వాల్)..ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది అని తెలుస్తుంది. ‘హరి హర వీరమల్లు’ 17వ శతాబ్దానికి చెందిన మొఘల్ సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా. ఏ.ఎం.రత్నం  (AM Rathnam)  భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సగ భాగాన్ని క్రిష్ డైరెక్ట్ చేయగా.. మిగిలిన పార్ట్ ను ఏ.ఎం.రత్నం తనయుడు జ్యోతి కృష్ణ(రత్నం కృష్ణ) (Jyothi Krishna )  కంప్లీట్ చేస్తున్నారు. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ షూటింగ్ పార్ట్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో.. రిలీజ్ అవుతుందా? అనే సందేహాలు కూడా ఏర్పడుతున్నాయి. త్వరలోనే దానిపై కూడా ‘వీరమల్లు’ టీం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ లిరికల్ సాంగ్ ను ఒకసారి చూస్తూ వినండి :

ఫ్యాన్‌ ఫోన్‌ లాక్కొని జేబులో పెట్టుకున్న స్టార్‌ హీరో.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus