ఆఫర్లు తగ్గిన డైరెక్టర్లే టాలీవుడ్ వైపు చూస్తున్నారా?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు తమిళ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా తెలుగు, తమిళ భాషల్లో మార్కెట్ ను పెంచుకోవచ్చని స్టార్ హీరోలు భావిస్తున్నారు. అయితే టాలీవుడ్ హీరోలకు తమిళ డైరెక్టర్లు షాకిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. తమిళంలో ఆఫర్లు తగ్గిన డైరెక్టర్లు టాలీవుడ్ వైపు దృష్టి పెడుతున్నారు. లింగుస్వామి డైరెక్షన్ లో రామ్ హీరోగా తెరకెక్కిన ది వారియర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

గత కొన్నేళ్లుగా సక్సెస్ లో లేని లింగుస్వామిని నమ్మి రామ్ తప్పు చేశాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాక్ ఆశించిన విధంగా లేకపోవడం ఫ్యాన్స్ ను సైతం ఒకింత బాధ పెడుతుండటం గమనార్హం. వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు మరింత తగ్గే అవకాశం అయితే ఉంది. బాలయ్య కేఎస్ రవికుమార్ కాంబోలో తెరకెక్కిన రూలర్ సైతం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. మహేష్ మురుగదాస్ కాంబోలో తెలుగులో తెరకెక్కిన స్పైడర్ సైతం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు.

శంకర్ రామ్ చరణ్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. టాలీవుడ్ హీరోలు ఇతర భాషల డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడంలో తప్పు లేదని అయితే కథ మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే ఛాన్స్ ఇవ్వాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

రామ్ కు ది వారియర్ సినిమాతో మరో ఫ్లాప్ ఖాతాలో చేరినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కెరీర్ విషయంలో హీరో రామ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus