టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో హీరో విశాల్ కు (Vishal) మంచి పేరు ఉంది. విశాల్ తన సినీ కెరీర్ లో హీరో రోల్స్ లో కనిపించడానికే ఇష్టపడ్డారు. రత్నం (Rathnam) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశాల్ తను రిజెక్ట్ చేసిన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. వరుడు (Varudu) సినిమాలో విలన్ రోల్ కోసం మొదట నన్ను సంప్రదించారని ఆ సమయంలో డేట్స్ కుదరక నేను చేయలేదని ఆయన తెలిపారు.
లియో (LEO) సినిమాలో అర్జున్ (Arjun Sarja) పోషించిన పాత్ర కోసం కూడా నన్ను సంప్రదించారని డేట్స్ కుదరకపోవడం వల్ల ఆ సినిమాను కూడా వదులుకున్నానని విశాల్ పేర్కొన్నారు. అయితే విశాల్ మాటలు మాత్రం అస్సలు నమ్మేలా లేవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విశాల్ కావాలనే ఆ సినిమాలను రిజెక్ట్ చేసి డేట్స్ సమస్య అని చెబుతున్నాడని బన్నీ (Allu Arjun) , విజయ్ (Vijay Thalapathy) అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆ సినిమాలలో విశాల్ చేయకపోవడమే మంచిదని పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలలో నటించడం వల్ల ఉపయోగం ఏంటని విశాల్ ఫ్యాన్స్ చెబుతున్నారు. విశాల్ వరుస సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి. ఒకింత పరిమిత బడ్జెట్ తో విశాల్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. విశాల్ పాన్ ఇండియా కాన్సెప్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
విశాల్ భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని చెబుతుండగా నిజంగానే పాలిటిక్స్ పై దృష్టి పెడతారో లేదో చూడాలి. ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు రాజకీయాలపై దృష్టి పెట్టినా ఆశించిన రేంజ్ లో ఫలితాలను అందుకోవడం లేదు. విశాల్ కు పొలిటికల్ గా ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది. విశాల్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.