ప్రముఖ రచయిత కోనవెంకట్ కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ‘నిన్ను కోరి’, ‘జై లవకుశ’ ఇలా ఎన్నో హిట్టు సినిమాలకు ఆయన రచయితగా పని చేశారు. ఓవైపు రచయితగా పనిచేస్తూనే.. మరోపక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు కోన వెంకట్. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కాలేజ్ లో చదువుకుంటున్న సమయంలో గంజాయి స్మగ్లింగ్ చేశానంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
ఆర్థిక సమస్యల వలన అప్పుల్లో కూరుకుపోయిన తన స్నేహితుడు ఒకడు దాని నుంచి బయటపడేందుకు గంజాయి పండించాడని.. ఆ మొత్తాన్ని గోవాకి తరలించి అప్పులన్నీ తీర్చేద్దామనుకున్నాడని వెల్లడించారు. కానీ దారిలో పోలీసులకు దొరికిపోవడంతో.. ఇక అంతా అయిపోయిందనుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడని గుర్తు చేసుకున్నారు. అతడు చావుబతుకుల్లో ఉన్నప్పుడు విషయం తెలిసి.. ఎలాగైనా వాడి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. కోనవెంకట్ తండ్రి అప్పుడు డీఎస్పీ కావడంతో ఆయన కారులో గోవా వెళ్లి గంజాయి అమ్మాలని నిర్ణయించుకున్నట్లు గుర్తుచేసుకున్నారు.
మహబూబ్ నగర్, కర్ణాటక, గోవా ఇలా మూడు చెక్ పోస్ట్ లు పగడ్బందీగా దాటించి గంజాయి అమ్మి డబ్బులు తీసుకొచ్చామని తెలిపారు కోనవెంకట్. దాంతో తన స్నేహితుడి అప్పులన్నీ తీర్చేశామని.. కానీ ఒకవేళ దొరికితే ఏమై ఉండేదా అని చాలా సార్లు ఆలోచిస్తుంటానని చెప్పారు. తన లైఫ్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమా తీయాలనుకుంటున్నట్లు చెప్పారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. స్నేహితుడికి సాయం చేయాలనుకోవడం మంచిదే కానీ ఇలా గంజాయి అమ్మడం ఏంటని మండిపడుతున్నారు.
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?