ప్రముఖ టాలీవుడ్ రచయితలలో ఒకరైన కోన వెంకట్ పని చేసిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో కోన వెంకట్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కోన వెంకట్ మాట్లాడుతూ నా సినిమాలలో 20 30 శాతం సినిమాలు మినహా మిగతా సినిమాలు సక్సెస్ సాధించాయని తెలిపారు. ప్రతిసారి మన జడ్జిమెంట్ కరెక్ట్ అవుతుందని చెప్పలేమని కానీ ఎక్కువసార్లు నిజమైందని ఆయన తెలిపారు.
హరీష్ శంకర్ నా అసిస్టెంట్ అని ఆర్జీవీ డైరెక్టర్ కావాలని అడిగితే షాక్ సినిమాకు పని చేసే ఛాన్స్ ఇప్పించానని కోన వెంకట్ అన్నారు. ఆర్జీవీ నమ్మి చేసిన కథ షాక్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమాలకు నేను పని చేయలేదని కోన వెంకట్ అన్నారు. స్క్రీన్ ప్లే విషయంలో పూరీ తడబడితే కథల విషయంలో హరీష్ శంకర్ తడబడతాడని కోన వెంకట్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
హరీష్ శంకర్ కు రచయిత అవసరం లేదని కోన వెంకట్ తెలిపారు. మనం సినిమాకు పని చేస్తే సినిమా ఫలితాలకు కూడా మనం బాధ్యత వహించాల్సి ఉంటుందని కోన వెంకట్ పేర్కొన్నారు. కెరీర్ తొలినాళ్లలో స్క్రీన్ పై నా పేరు ఎంతసేపు వచ్చిందని అడిగేవాడినని కోన వెంకట్ అన్నారు. బాద్ షా సినిమాలో నా టైటిల్ డ్యూరేషన్ తగ్గించారని కేవలం 2 సెకన్లు నా పేరు వేశారని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. శ్రీనువైట్ల నిజంగా అలా చేశారని ఆయన అన్నారు.
స్క్రీన్ పై నా పేరు చూశానా చూసినట్టు ఉన్నానా అని అనిపించిందని కోన వెంకట్ కామెంట్లు చేశారు. శ్రీనువైట్ల అలా చేయడం ఎంత దుర్మార్గం అని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. బాద్ షాలో నా నేమ్ విషయంలో మాత్రమే ఆ విధంగా జరిగిందని కోన వెంకట్ కామెంట్లు చేశారు. కావాలంటే యూట్యూబ్ లో చూడండని ఆయన అన్నారు. ఇప్పుడు పేరు వేయకపోయినా నేను పెద్దగా పట్టించుకోనని కోన వెంకట్ పేర్కొన్నారు.