వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ‘కొంచెం కారం కొంచెం తీపి’ సిరీస్..!

వినూత్నమైన కంటెంట్ తో ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తూ వస్తోన్న ‘తమడా మీడియా సంస్థ’ వారి నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కుతున్న మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ ‘కొంచెం కారం కొంచెం తీపి’. బుల్లితెర పవర్ స్టార్ గా పిలవబడుతున్న డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల భార్య మంజుల పరిటాల ఈ సిరీస్ లో నటిస్తుండడం విశేషం. హృతి కూడా మరో ముఖ్య పాత్రలో నటించడం విశేషం. ‘చేదు-తీపి జీవితాల గమనంలో ఇద్దరు మహిళలు ఒకరికొకరు ఆసరా స్తంభాలుగా ఎలా నిలబడ్డారు అనేది ఈ సిరీస్ థీమ్.

మహిళా దినోత్సవం నాడు ఈ సిరీస్ లాంఛనంగా ప్రారంభమైంది. ‘గ్రూప్ ఎం’ యొక్క మోషన్ కంటెంట్ గ్రూప్ ‘కొంచెం కారం కొంచెం తీపి’ కి జెమినితో కలిసి భాగస్వామిగా వ్యవహరించబోతుంది. జెమిని ఛానెల్ మరియు ‘తమడా మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ ప్లాట్‌ఫార్మ్ వారి ‘The Mix by Wirally’ YouTubeలో రాత్రి 10:00 గంటలకు స్ట్రీమింగ్ కానుంది.సోమవారం నుండీ శనివారం వరకు ఈ ఇద్దరు మహిళల తీపి, కారంతో కూడుకున్న గమనాన్ని మనం వీక్షించవచ్చు.

ఎపిసోడ్-1

ఎపిసోడ్-2

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus