Vaishnav Tej, Rakul Preet: ‘కొండపొలం’కి ముందు వేరే పేరు అనుకున్నారట

సినిమా వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ అంటుంటారు. సినిమా పేర్లు, విడుదల తేదీలు… ఇలా అన్నింటా ఆ సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… ‘కొండపొలం’ టైటిల్‌ గురించే. అక్టోబరు 8న విడుదలవుతున్న ఈ సినిమా గురించి ప్రముఖ రచయిత, ఈ సినిమాకు మూలమైన నవల రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సినిమాకు తొలుత పెడదామనుకున్న టైటిల్‌ గురించి కూడా చెప్పారు. ‘కొండపొలం’ సినిమాకు వర్కింగ్‌ టైటిల్‌ అంటూ చిత్రబృందం ఏదీ ఆఫీషియల్‌గా చెప్పలేదు.

అయినప్పటికీ… టాలీవుడ్‌ వర్గాలు మాత్రం ‘కొండపొలం’ అనే చెప్పాయి. కారణం ఆ సినిమా మూలకథ ‘కొండపొలం’ నవల అవ్వడమే. అయితే మధ్యలో సినిమాకు వేరే పేర్లు ఆలోచనలోకి వచ్చాయని కూడా వార్తలొచ్చాయి. అందులో ‘వనవాసి’, ‘జంగిల్‌బుక్‌’ లాంటి పేర్లు వినిపించాయి. కానీ ఆఖరికి ‘కొండపొలం’ పేరే ఖరారు చేసింది చిత్రబృందం. మనం భూమిని సాగుచేసి పంటను పండిస్తే… పొలం అంటాం. అదే సహజసిద్ధంగా ప్రకృతే పంటను ఇచ్చే ప్రదేశాన్ని ‘కొండపొలం’ అంటారట. అలా అడవిలో అలాంటి ఫలాలను పొందడానికి గొర్రెల కాపారుల చేసే ప్రయణాన్ని ‘కొండపొలం’ అంటారట.

ఈ విషయాన్ని సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి చెప్పారు. కడప జిల్లా పోరుమామిళ్ల, ఆ ప్రాంతాల్లో వారికి బాగా తెలుసట. మొదట సినిమాకు ‘వనవాసి’ అనే టైటిల్‌ పెట్టాలనుకున్నారట. అయితే క్రిష్‌ టీమ్‌ వద్దనుకుని… ‘కొండపొలం’ ఫిక్స్‌ చేశారు. ఇక్కడే సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ‘వనవాసి’లో ఉన్న ‘వాసి’ గురించే ఆ డిస్కషన్‌. మెగా ఫ్యామిలీకి ‘వాసి’ అంతగా కలసి రాలేదు. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘అజ్ఞాతవాసి’ దారుణం పరాజయం పొందింది. అందుకే ‘వనవాసి’ పేరు ఈ సినిమాకు వద్దని అనుకున్నారు అంటున్నారు. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా ఆ డిస్కషన్‌.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus