ఈరోజుల్లో కొత్త వాళ్లు తీసే సినిమాలు చూడ్డానికి ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే మ్యాజిక్ జరగాలి.. కంటెంట్‌తో పాటు ప్రమోషన్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి.. ఎంత క్రియేటివ్‌గా తమ మూవీని జనాల్లోకి తీసుకెళ్లాలా అని మేకర్స్ నానా తంటాలు పడుతుంటారు.. రీసెంట్‌గా ‘మీసాల రాజు గారి మీసాలు తీసేశారట ఎందుకు?’ అంటూ ‘కొరమీను’ అనే సినిమా మీద హైప్ క్రియేట్ చేశారు. లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ ద్వారా హీరోని రివీల్ చేశారు..
ఇప్పుడు టీజర్ యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని చేతుల మీదుగా విడుదల అయింది.. నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘ప్రతినిథి’ మూవీకి స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాసి ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకున్నాడు ఆనంద్ రవి.. ‘నా నీడ పోయింది సార్’ అంటూ రచనతో పాటు నటించిన ‘నెపోలియన్’ కూడా అలరించింది.. ‘విరాటపర్వం’ లోనూ మంచి క్యారెక్టర్ చేశాడు. మల్టీ టాలెంటెడ్ ఆనంద్ రవి హీరోగా ‘కొరమీను’ తెరకెక్కుతోంది.. శ్రీపతి కర్రి దర్శకుడు..
పోలీస్ ఆఫీసర్ మీసాల రాజు గారికి జాయిన్ అయిన రోజునే జాలరిపేటలో మీసాలు తీసేశారనే అనౌన్స్‌మెంట్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది.. ‘‘డబ్బుది ఎక్కువ పవర్ అనుకుంటారు కానీ అసలైన పవర్ భయానిదే.. ఇది జాలరుపేట.. డబ్బునోడు, లేనోడు.. అంతే.. మీ నాన్న ఎన్ని అబద్ధాలాడితే పుట్టావే.. మీ తాతనడగరా.. ఎన్ని అబద్ధాలాడితే మీ అమ్మ పుట్టిందో’’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.. ‘ఈయనే మీసాల రాజు.. ఇప్పుడు లేవంతే’ అంటూ చివర్లో ఇచ్చిన పంచ్ అదిరిపోయింది..
ముందుగా చెప్పినట్టే ఈ ‘కొరమీను’ కథ ఈగో చుట్టూ తిరుగుతుందని టీజర్‌తో క్లారిటీ ఇచ్చారు.. మీసాల రాజుగా శత్రు కనిపించాడు.. ఆయన మీసాల జాలరిపేట వాళ్లే తీశారు కానీ తీసింది ఎవరనేది మాత్రం సస్పెన్స్.. ఆనంద్ రవి ఈ సినిమాతో మరోసారి తన పెన్ పవర్ చూపించబోతున్నాడని అర్థమవుతోంది.. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్‌గా నిలిచాయి.. ‘కొరమీను’ టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది..