టాలీవుడ్ లో దర్శకుల హవా కొనసాగుతూనే ఉంది…అప్పట్లో బడా దర్శకులు సినిమాలను హీరోలను శాసించేవారు అని చాలా సార్లు విన్నాం అయితే కాల క్రమేణా హీరోల వర్షిప్ పెరగడంతో కాస్త వెనుక బడ్డ దర్శకులు ఇప్పుడు మాత్రం ఎక్కడా వెనకాడకుండా హిట్ కొట్టగానే రెమ్యునిరేషన్స్ ను అమాంతంగా పెంచేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు ఈ కధ అంతా ఎందుకు అంటారా…విషయంలోకి వెళితే… కొరటాల శివ….ముచ్చటగా తీసినవి మూడు సినిమాలే అయినా…సూపర్ సక్సెస్ లు కొట్టి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన దర్శకుడిగా ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరిగా ఉన్నారు…అయితే ఇప్పుడు గతంలో ఒకసారి ప్రిన్స్ తో జతకట్టిన మన కొరటాల… మళ్లీ మరోసారి ప్రిన్స్ తో చేసేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమా రెమ్యునరేషన్ విషయంలో మహేష్ మైండ్ బ్లాంక్ చేసేలా డిమాండ్ చేస్తున్నాడు మన దర్శకుడు…ఇంతకీ ఈ సినిమాకు దర్శకుడు ఎంత రెమ్యునిరేషన్ తీసుకుంటున్నాడు అంటే మహేష్ సినిమా అవర్స్స్ రైట్స్ కావాలి అంటున్నాడని సమాచారం. మహేష్ సినిమా ఓవర్సీస్ రైట్స్ అంటే సూపర్ క్రేజ్. అక్కడ తెలుగు సినిమా విజయ కేతనం ఎగురవేసింది మహేష్ బాబే. శ్రీమంతుడు 2.9 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది ఆ లెక్కన కొరటాల శివ 19 కోట్లు తీసుకుంటున్నట్టు లెక్క. రాబోయే సినిమాకు కూడా అదే రేంజ్ బిజినెస్ జరిగితే కొరటాల శివ 17-19 కోట్ల దకా జేబులో వేసుకుంటాడు. మొత్తానికి దీంప ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న ఫార్ములాని మన దర్శకులు బాగా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. చూద్దాం మరి ఈ డీల్ కి నిర్మాత ఏమంటాడో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.