Koratala Siva: ‘ఆచార్య’ రిజల్ట్ .. కొరటాలని అన్ని రకాలుగా దెబ్బ తీసిందిగా..!

‘మిర్చి’ ‘శ్రీమంతుడు’ ‘జనతా గ్యారేజ్’ ‘భరత్ అనే నేను’ వంటి హిట్ చిత్రాలతో.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న కొరటాల శివ.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కంట్లో పడ్డాడు. కొరటాల శివతో సినిమా చేయాలని పిలిపించుకుని మరీ కథ ఉంటే తీసుకురమ్మని చెప్పాడు. నిజానికి ‘మిర్చి’ తర్వాత రాంచరణ్ తో ఓ చిత్రాన్ని మొదలుపెట్టాడు కొరటాల శివ. అది ఎందుకో కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మళ్ళీ కొన్నాళ్ల తర్వాత అదే కాంబినేషన్లో సినిమా అన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్టు ప్రకటించారు కూడా ఆ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయ్యింది. ఫైనల్ గా చిరు.. కొరటాలతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించి కథ ఓకె చేయించుకుని లాక్ చేశారు. ఆ టైములో చిరు ‘సైరా’ పేరు చెప్పి కొరటాలని రెండేళ్లు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారు. కొరటాల ఒక్కో సినిమాకి రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటారు. 8 నెలల్లో సినిమాని ఫినిష్ చేసేస్తుంటారు.

అలా చూసుకుంటే అప్పటికే ఆయన 2 ప్రాజెక్టులను పోగొట్టుకున్నట్టే. కొరటాల ఓకే అంటే స్టార్ హీరోలు వెంటనే కాల్ షీట్లు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఆయనకి అంత డిమాండ్ ఉంది. అందుకే చిరు కూడా ఆయన్ని వదల్లేదు. ‘ఆచార్య’ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు రెండేళ్లు, సినిమా స్టార్ట్ అయ్యాక ఇంకో రెండేళ్లు టైం పట్టింది. ఫైనల్ గా సినిమా రిలీజ్ అయ్యింది. ఏప్రిల్ 29న విడుదలైన ‘ఆచార్య’ ఘోర పరాజయం పాలైంది.

4 సినిమాలతో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు ఈ సినిమాతో పోయినట్టు అయ్యింది. కొరటాల ఈ ప్రాజెక్టు కనుక నెత్తిన పెట్టుకోకపోయి ఉంటే అతనికి రూ.40 కోట్లు మిగిలేది. పోనీ ‘ఆచార్య’ సినిమాకి పారితోషికం తీసుకున్నాడా అంటే అది కూడా లేదని ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పుకొచ్చాడు.ఇలా ‘ఆచార్య’ వల్ల ఆయన డబ్బు పోయింది, పేరు పోయినట్టు అయ్యింది. కొరటాల తర్వాతి సినిమాని ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం స్క్రిప్ట్ ను ఇంకోసారి పరిశీలించాలని డిసైడ్ అయ్యి కొరటాలను మీట్ కాబోతున్నాడట.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus