2013 లో ‘మిర్చి’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు కొరటాల శివ. ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. కానీ తరువాతి సినిమాకి హీరోని వెతుక్కోవడానికి కొరటాలకు ఏడాది పైనే టైం పట్టింది.మధ్యలో చరణ్ తో సినిమా మొదలుపెట్టినా అది క్యాన్సిల్ అయ్యింది. దాంతో 2014లో కొరటాల సినిమా రాలేదు. మహేష్ బాబు తో ‘శ్రీమంతుడు’ సినిమా ఓకే అయ్యింది. ఏడాది లోనే ఆ చిత్రాన్ని ఫినిష్ చేసి.. 2015 లో రిలీజ్ ఇచ్చాడు. ఆ తరువాత ఎన్టీఆర్ తో కూడా ‘జనతా గ్యారేజ్’ ను 2016లోనే విడుదల చేసాడు.
అయితే 2017లో మహేష్ ‘స్పైడర్’ వల్ల ‘భరత అనే నేను’ సినిమా షూటింగ్ కు లేట్ అయ్యింది. కానీ త్వరగానే ఫినిష్ చేసి 2018 లో సమ్మర్ కే ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని విడుదల చేసాడు. అయితే ఆ తరువాత చిరంజీవి తో సినిమా కోసం వెయిట్ చేస్తూనే వచ్చాడు. ‘సైరా’ వల్ల 2019 మొత్తం కొరటాల శివ నుండీ సినిమా కూడా రాలేదు. ఇక 2020 లో ‘ఆచార్య’ ను విడుదల చెయ్యాలి అని అనుకున్నాడు. కానీ వైరస్ మహమ్మారి వల్ల అది కుదిరేలా లేదు. దీంతో ఈ ఏడాది కూడా కొరటాల శివ నుండీ సినిమా వచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది.
షూటింగ్ లకు పర్మిషన్ లభించినా… మెగాస్టార్ మాత్రం ప్రస్తుతం షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా లేరట. దీంతో కొరటాల బాగా హర్ట్ అయ్యాడట. ‘భరత్ నేను నేను’ సినిమా పూర్తయిన వెంటనే తన దగ్గర ఉన్న కథలతో.. 9 నెలలకి ఓ సినిమా చేసినా ఈ పాటికి రెండు సినిమాలు ఫినిష్ చేసేవాడిని కదా అని కొరటాల ఫీలయ్యాడట. అందులోనూ ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకూ కొరటాల పారితోషికం అందుకుంటున్నాడు కాబట్టి .. 30 కోట్ల వరకూ ఈ రెండేళ్లలో కొరటాల నష్టపోయినట్టే అని చెప్పాలి..!
Most Recommended Video
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!