మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఆచార్య సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ సమయానికి ఆచార్య బుకింగ్స్ పుంజుకోవడంతో చిరంజీవి, చరణ్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఆచార్య సినిమాలో కాజల్ పాత్రను పూర్తిగా తీసేశామని దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారనే సంగతి తెలిసిందే. ఆచార్యలో కాజల్ ను తీసేశారని వార్తలు ప్రచారంలోకి వచ్చిన తర్వాత ఈ సినిమాలో అనుష్క నటిస్తున్నారని మరి కొందరు ప్రచారం చేశారు.
అయితే దర్శకుడు కొరటాల శివ ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలో అనుష్క నటించడం లేదని తేల్చి చెప్పారు. ఆచార్య రూమర్స్ గురించి కొరటాల శివ డైరెక్ట్ గానే క్లారిటీ ఇచ్చారు. ఆచార్యలో అనుష్క నటిస్తుందని ఆశించిన అభిమానులకు మాత్రం నిరాశ తప్పదని తెలుస్తోంది. మరోవైపు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల గురించి ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది.
కొరటాల శివ ప్రతి సినిమాలో హీరో నాన్ లోకల్ కావడం గమనార్హం. ఆచార్య సినిమాలో ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ కనిపించదు. ఈ సన్నివేశాలను కొరటాల శివ ఎలా డీల్ చేస్తారో చూడాల్సి ఉంది. కొరటాల శివకు కెరీర్ పరంగా ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకమని చెప్పవచ్చు. కొరటాల శివ ఏకంగా నాలుగేళ్లు ఈ సినిమాకే సమయం కేటాయించారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాలి.
మరోవైపు రిలీజ్ తర్వాత మిగిలే డబ్బులను బట్టి చిరంజీవి, చరణ్, కొరటాల శివలకు రెమ్యునరేషన్ దక్కనుంది. ఆచార్యకు వడ్డీల భారం పెరగడంతో చిరంజీవి, చరణ్, కొరటాల శివలకు రెమ్యునరేషన్ లో కొంత మేర కోత తప్పదని సమాచారం అందుతోంది. కొరటాల శివ సినిమాలలో కథ సింపుల్ గా ఉన్నా కథనం అద్భుతంగా ఉంటుంది. అందువల్లే ఈ దర్శకుని ఖాతాలో వరుస విజయాలు చేరుతున్నాయి.