Koratala Siva, Jr NTR: తారక్‌ సినిమాపై కొరటాల క్లారిటీగానే ఉన్నారట!

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నటించడానికి తారక్‌ ఓకే చెప్పేశాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు జోరందుకున్నాయి. ఆ మధ్య ఉందో లేదో తెలియదు అంటూ వచ్చిన వార్తలు కాస్త… త్వరలో సినిమా ప్రారంభం అనేలా మారిపోయాయి. దీంతో మరి కొరటాల శివ సినిమా పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న మొదలైంది. నిజానికి ఈ పాటికి కొరటాల – తారక్‌ సినిమా ఒకటో, రెండో షెడ్యూల్స్‌ అయిపోవాలి. ఎన్టీఆర్‌ ఇంటికి దగ్గర్లోనే సెట్స్‌ కూడా వేస్తున్నామని ఆ మధ్య కొరటాల చెప్పారు.

Click Here To Watch Now

కరోనా పరిస్థితుల కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల వాయిదా పడటంతో కొరటాల శివ సినిమా సంగతి పక్కకు వెళ్లింది అని కూడా ఉన్నారు. ఇప్పుడు బుచ్చిబాబు సానా సినిమా ముచ్చట్లు బయటకు రావడంతో… కొరటాల శివ సినిమా విషయంలో క్లారిటీ కావాలంటూ వార్తలు, గాసిప్స్‌ గుప్పుమన్నాయి. ఈ విషయంలో కొరటాల టీమ్‌ ఆలోచనలు ఇవే అంటూ మరికొన్ని గాసిప్స్‌ బయటకు వచ్చాయి. వాటి ప్రకారం చూస్తే తారక్‌ – కొరటాల సినిమా వచ్చే నెలాఖరులో మొదలవ్వొచ్చు.

ఎన్టీఆర్‌ ‘ఆర్ఆర్‌ఆర్‌’ ప్రచార పనుల్లో బిజీగా ఉన్నాడు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వెళ్తున్నాడు. ఈ హడావుడి వచ్చే నెల మొదటివారం వరకు కచ్చితంగా ఉంటుంది. సినిమా విడుదల ముందు ప్రచారం, విడుదల తర్వాత ప్రచారం చేయాల్సిందే. ఆ తర్వాత తారక్‌ ఫ్రీ అయినా… కొరటాల శివ బిజీ అయిపోతారు. చిరంజీవి – రామ్‌చరణ్‌ స్పెషల్‌ కాంబోలో సిద్ధమైన ‘ఆచార్య’ వచ్చే నెల 29న విడుదల చేస్తున్నారు. ఆ సినిమా ప్రచారం, ఆ తర్వాత కార్యక్రమాలకు కొరటాల బిజీ అయిపోతారు.

ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌ మే నెలలో ఉండొచ్చు అని అంటున్నారు. అయితే ఈ లోపు ముహూర్తపు షాట్‌లు లాంటివి తీస్తారు అని కూడా అంటున్నారు. అయితే దీనిపై చిత్రబృందం నుండి అధికారిక సమాచారం అయితే రావాల్సి ఉంది. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై పూర్తి సమాచారం వస్తుంది అంటున్నారు. పనిలో పనిగా చాలా క్లారిటీలు కూడా ఇస్తారు అని చెబుతున్నారు. చూద్దాం ఏం చెబుతారో?

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus