‘మెగా 152’ లో హీరోయిన్ గా అనుష్క..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్ర షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మెగాస్టార్ కు 151 వ చిత్రం. ఇక ఈ చిత్రం పూర్తయిన వెంటనే కొరటాల శివ డైరక్షన్ లో 152 వ చిత్రాన్ని కూడా మొదలుపెట్టడానికి మెగాస్టార్ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చక-చకా జరిగిపోతున్నాయట.

ఇక ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా మొదట నయనతారనే అనుకున్నారట. ప్రస్తుతం ‘సైరా’ చిత్రంలో నటిస్తున్న నయనతార తమిళ్ లో కన్ ఫర్మ్ చేసిన ప్రాజెక్ట్స్ చాలా ఉండటంతో.. రిజెక్ట్ చేసిందట. దీంతో అనుష్క ను సెలెక్ట్ చేసాడట కొరటాల. అయితే అనుష్కను లావుగా మారడంతో.. కొరటాల ఓ కండిషన్ పెట్టాడట. ఈ చిత్రం షూటింగ్ మార్చిలో మొదలు కాబోతుందట. అనుష్కకి సంబందించిన షెడ్యూల్ ఏప్రిల్ లేదా మే లో ఉండబోతుండడంతో.. ఈలోపు బరువు తగ్గి, కాస్త నాజూగ్గా తయారు కావాలని అనుష్కకి కండిషన్ పెట్టాడట. ఇప్పుడు అనుష్క కూడా బరువు తగ్గే పనిలోనే ఉందట. గతంలో మెగాస్టార్ తో కలిసి ‘స్టాలిన్’ చిత్రంలో ఓ పాటలో కనిపించింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus