కొరటాల షాకింగ్ డెసిషన్..నెక్స్ట్ నవీన్ పోలిశెట్టితోనట..!

దర్శకుడు కొరటాల శివ.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇది పూర్తయిన తరువాత అల్లు అర్జున్ తో ఒక పాన్ ఇండియా చిత్రం చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రం 2022 లో రాబోతుంది అని కూడా నిర్మాతలు ప్రకటించారు. 2021 సమ్మర్ కి ‘ఆచార్య’ వర్క్ కంప్లీట్ అవుతుంది. అయితే బన్నీతో సినిమా మొదలయ్యే లోపు కొరటాల ఓ చిన్న హీరోతో పని చెయ్యడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట.

ఆ చిన్న హీరో మరెవరో కాదు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన నవీన్ పోలిశెట్టి అని తెలుస్తుంది. అయితే కొరటాల … నవీన్ చెయ్యబోయేది సినిమా కాదట… వెబ్ సిరీస్ అని సమాచారం. ఆ వెబ్ సిరీస్ ను కూడా కొరటాల శివ డైరెక్ట్ చెయ్యడట. నిర్మాతగా అలాగే రైటర్ గా కొరటాల ఈ వెబ్ సిరీస్ కు పనిచేస్తాడట. కొరటాల శివ అసిస్టెంట్ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది.

టీనేజ్ లో ఉన్న యువత గురించి అలాగే ఏ మాత్రం మెచ్యూరిటీ లేని ప్రేమల గురించి …ఈ వెబ్ సిరీస్ లో ప్రస్తావించబోతున్నట్టు వినికిడి.ఇలాంటి యూత్ ఫుల్ వెబ్ సిరీస్ కు నవీన్ పోలిశెట్టి వంటి క్రేజ్ ఉన్న హీరో అయితేనే కరెక్ట్ అని కొరటాల డిసైడ్ అయ్యారట. నవీన్ పోలిశెట్టి కూడా ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని వినికిడి.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus