చిరంజీవి కోసం అంతా సిద్ధం చేస్తున్న కొరటాల శివ

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర పనులు పూర్తికాగానే… రెస్ట్ తీసుకోకుండగానే కొరటాల సినిమాని మొదలు పెట్టనున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పేరు తెచ్చుకున్న కొరటాలకి చిరు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే ప్రశాంతంగా చిరు 152 వ చిత్రానికి సంబంధించిన పనులను చేసుకుంటూపోతున్నారు. భరత్ అనే నేను సినిమా తర్వాత విదేశాల్లో విహారానికి వెళ్లిన కొరటాల.. ఫ్రెష్ మైండ్ తో హైదరాబాద్ కి వచ్చి స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టారు. ఈ పనుల్లో ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.

అందుకే ఆర్టిస్టుల సెలక్షన్ మొదలు పెట్టారు. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే ఆమెను ముందు సెలక్ట్ చేసేస్తే పెద్ద పని అయిపోతుందని భావించిన కొరటాల.. హీరోయిన్స్ పై దృష్టిపెట్టారు. సీనియర్ హీరోయిన్స్ అనుష్క, త్రిష, శ్రియ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. త్రిష, శ్రియలో చిరుతో ఇదివరకే కలిసి నటించి హిట్స్ అందుకున్నారు. అనుష్క ఓ పాటలో నర్తించింది కానీ హీరోయిన్ గా చేయలేదు. ఖైదీ నంబర్ 150 , సైరా లోను ఆమె పేరు అనుకున్నారు. కానీ కుదరలేదు. ఈ సారి సెట్ అవుతుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus