గత కొంతకాలంగా చిత్రపరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, హీరోలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, మేనేజర్ల పేర్లు డైరెక్ట్ గా లేక ఇండైరెక్ట్ గా పబ్లిక్ అవుతున్న విషయం తెలిసిందే. చాలామంది మహిళలు ముందుకొచ్చి తాము ఎవరివల్ల అయితే నష్టపోయారో వారి పేర్లు బహిరంగంగా చెబుతుండడం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా కొరటాల శివ పేరు కూడా వినిపించింది.
డైరెక్ట్ గా శివ పేరు ఎవరూ చెప్పకపోయినా.. కొరటాల శివ అని అర్ధమయ్యేలా ఆయన గురించి కథనాలు వెలువడ్డాయి. మొదట్లో ఈ కథనాల గురించి రెస్పాండ్ అవ్వకూడదనుకొన్న కొరటాల శివ తన తాజా చిత్రం “భరత్ అనే నేను” విడుదలకు సిద్ధమవుతుండడంతో.. ఆ కామెంట్స్ ఎఫెక్ట్ తన సినిమా మీద మాత్రమే కాక తన పర్సనల్ లైఫ్ మీద కూడా పడే అవకాశం ఉండడంతో వేరే మార్గం లేక స్పందించాడు కొరటాల.
ఇవాళ విడుదల చేసిన ఒక స్పెషల్ వీడియోలో కొరటాల శివ మాట్లాడుతూ.. “నేను అసలు రెస్పాండ్ అవ్వకూడదు అనుకొన్నాను. కానీ.. రెస్పాండ్ అవ్వకపోతే నా అనుకున్నవాళ్లు ఈ విషయమై ఎక్కువగా బాధపడేలా ఉన్నారని భావించి. ఈ విధంగా రెస్పాండ్ అవుతున్నాను. వివేకానందుడి మీదే ఆయన అమెరికా వెళ్లినప్పుడు బోలెడన్ని ఎలిగేషన్స్ వచ్చాయి, నేనెంత. ఇప్పటివరకూ నేనెప్పుడు ఏ అమ్మాయితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు. నా జీవితంలో మా అమ్మ, నా భార్య తప్ప వేరే అమ్మాయి కూడా లేదు” అంటూ క్లారిటీ ఇచ్చాడు కొరటాల.