Koratala Siva: కొరటాల కథ.. తిరిగి తిరిగి ఎన్టీఆర్ వద్దకే వచ్చిందట..!

మెగాస్టార్ చిరంజీవి తో ‘ఆచార్య’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. మే లో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ఇంకా కొంత పార్ట్ షూటింగ్ బ్యాలన్స్ మిగిలివుంది.ఇదిలా ఉండగా.. కొరటాల తన తరువాతి సినిమాని ఎన్టీఆర్ తో చేయబోతున్నట్టు ఇటీవల అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ‘యువ సుధ ప్రొడక్షన్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా కళ్యాణ్ రామ్ సహా నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుంది.ఇక మిక్కిలినేని సుధాకర్.. దర్శకుడు కొరటాల శివకు మంచి స్నేహితుడన్న సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ లో కొరటాల శివ కు పార్ట్నర్ షిప్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.! ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అదేంటి అంటే గతేడాది ఈ ప్రాజెక్ట్ బన్నీ తో చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ మొదట అంటే 4 ఏళ్ల క్రితం ‘జై లవ కుశ’ టైములోనే ఈ కథని ఎన్టీఆర్ తో కొరటాల శివ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. అప్పుడు ఎన్టీఆర్ తో కొరటాల శివ మూవీ ‘యువ సుధ ప్రొడక్షన్’ బ్యానర్లో మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తారని అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

కానీ స్క్రిప్ట్ సంతృప్తికరంగా లేదని ఎన్టీఆర్-కొరటాల ఆ ప్రాజెక్ట్ ను లైట్ తీసుకున్నారట. అయితే తరువాత స్క్రిప్ట్ ఓకె అయ్యాక ఎన్టీఆర్ .. ‘ఆర్.ఆర్.ఆర్’ తో బిజీగా ఉండడం వలన కొరటాల శివ.. అల్లు అర్జున్ తో చెయ్యడానికి రెడీ అయ్యాడు.’కెమికల్ ఫ్యాక్టరీల వల్ల ప్రకృతి ఎలా నాసనమైపోతుంది’ అనే పాయింట్ తో ఈ చిత్రం కథ ఉంటుందని.ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఏమైనా ఈ కథ ఎన్టీఆర్ దగ్గర మొదలయ్యి..తరువాత బన్నీ వద్దకు వెళ్ళి .. మళ్లీ ఎన్టీఆర్ వద్దకే రావడం విశేషం.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus