Koratala Siva: బయ్యర్ల విషయంలో కొరటాల నిర్ణయమిదేనా?

  • May 4, 2022 / 02:13 PM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమా విషయంలో ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచారనే సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా 4వ రోజు కలెక్షన్లు కోటి రూపాయల కంటే తక్కువ మొత్తం అంటే ఈ సినిమా ఏ స్థాయి ఫ్లాప్ అనే విషయం సులువుగా అర్థమవుతోంది. అయితే ఆచార్య సినిమా ఫలితం, నష్టాలు ఎన్టీఆర్ సినిమాపై ఏ మాత్రం ప్రభావం చూపకూడదని కొరటాల శివ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ఆచార్య సినిమాకు నిర్మాత నిరంజన్ రెడ్డి కాగా నిరంజన్ రెడ్డి ఇప్పటికే బయ్యర్లకు కొంత మొత్తాన్ని వెనక్కు ఇచ్చారని తెలుస్తోంది.

చిరంజీవి రామ్ చరణ్ కూడా కొంత మొత్తాన్ని బయ్యర్లకు వెనక్కు ఇచ్చారని సమాచారం అందుతోంది. కొరటాల శివ కూడా తన పారితోషికంలో ఎక్కువ మొత్తాన్ని బయ్యర్లకు ఇవ్వాలని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆచార్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన వాళ్లలో కొరటాల శివ స్నేహితులు కూడా ఉన్నారు. తనపై ఉన్న నమ్మకంతో ఈ సినిమాపై పెట్టుబడులు పెట్టిన వాళ్లను ఆదుకునే దిశగా కొరటాల శివ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ సినిమాకు ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు రాకూడదని కొరటాల శివ భావిస్తున్నారు. మరోవైపు త్వరలో తారక్, కొరటాల శివ కలవబోతున్నారని ఆచార్య సినిమా ఫలితం గురించి చర్చించనున్నారని సమాచారం అందుతోంది. ఆచార్య ప్రభావం నుంచి త్వరగా కోలుకుని తారక్ సినిమా పనులను కొరటాల శివ మొదలుపెట్టనున్నారు. జూన్ నెల రెండో వారం నుంచి తారక్ కొరటాల శివ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది.

కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. వరుసగా 4 విజయాలను సొంతం చేసుకున్న కొరటాల శివ ఐదో సినిమా ఆచార్యతో చేదు ఫలితాన్ని అందుకున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus