టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన “దేవర” (Devara) భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక బాక్సాఫీస్ వద్ద గట్టి కలెక్షన్లను సాధించినప్పటికీ, సినిమా కంటెంట్‌పై కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఓటీటీలో విడుదలైన తర్వాత నెగెటివ్ కామెంట్స్ పెరిగాయి. దీంతో “దేవర 2” చేయడం అవసరమా అన్న చర్చలు ప్రారంభమయ్యాయి. కొరటాల శివ ప్రస్తుతం “దేవర 2” (Devara 2) స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారని సమాచారం.
ఈసారి కథలో మరింత ఎమోషన్, యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే మొదటి భాగం విమర్శలను అధిగమించి, రెండవ భాగానికి సానుకూల స్పందన రావాలని దర్శకుడు కఠినంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ ప్రస్తుతం “వార్ 2” షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అలాగే ప్రశాంత్ నీల్‌తో (Prashanth Neel) కొత్త ప్రాజెక్ట్, మరో తమిళ దర్శకుడి ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉన్నాయి. ఈ తరుణంలో “దేవర 2” కోసం తారక్ తక్షణమే డేట్స్ కేటాయిస్తారా అన్నది పెద్ద ప్రశ్న.
ఈ గ్యాప్‌లో కొరటాల శివ కొత్త ప్రాజెక్ట్ గురించి కూడా ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు మొదటి భాగంలో హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడం వల్ల విమర్శలు ఎదురయ్యాయి. ఈసారి ఆమె పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సీక్వెల్‌ను ప్రేక్షకులకు విశ్వసనీయంగా చూపించాలంటే, స్క్రిప్ట్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.
“దేవర 2” నిర్మాణానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపించలేదనే వాదనలు ఉన్నప్పటికీ, కొరటాల శివ పూర్తి నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. తారక్ సన్నిహితులు కూడా సీక్వెల్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారని టాక్. అయితే కథలో కొత్తదనం, బలమైన ఎమోషన్‌తో ఈ సినిమా మొదటి భాగం కంటే మెరుగ్గా ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి కొరటాల శివ ఈ కన్ఫ్యూజన్‌కి ఎప్పుడు ముగింపు ఇస్తారో చూడాలి. “దేవర 2″పై క్లారిటీ రావడానికి ఇంకా కొంత సమయం అవసరమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.