సంక్రాంతి సీజన్‌కి రాబోతున్న రెండు భారీ సినిమాలు ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) – ‘డాకు మహరాజ్’ (Daaku Maharaaj). వీటి టిక్కెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14 రోజుల పాటు టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు మేకర్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై మేకర్స్ ఉత్సాహంగా ఉన్నప్పటికీ, ప్రేక్షకుల నుంచి వివిధ అభిప్రాయాలు వస్తున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ‘డాకు మహరాజ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ అనంతపురంలో ప్లాన్ చేశారు.
ఇక టిక్కెట్ రేట్ల పెంపు మేకర్స్‌కి భారీ కలెక్షన్ల ఆశలు పెంచింది. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకుందని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. పెద్ద బడ్జెట్ సినిమాలకు పెట్టుబడుల రికవరీకి ఈ హైక్ అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా జారీ చేసిన జీవో ప్రకారం, 14 రోజులపాటు టిక్కెట్ ధరలు పెంచుకోవచ్చని ప్రకటించినప్పటికీ, ఇది కేవలం 10 రోజులకే పరిమితం చేసే అవకాశం ఉందని సమాచారం.
ఈ మార్పు గురించి మేకర్స్ ఇంకా క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. 10 రోజులు కూడా పెద్ద సినిమాల కోసం సరిపోతుందని, ఇది కలెక్షన్లపై ప్రభావం చూపదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు టిక్కెట్ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోలేదు. దిల్ రాజు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో ఈ విషయంలో చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందనే ఊహాగానాలు ఉన్నాయి. టిక్కెట్ ధరల పెంపు పట్ల ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలు సాధారణ ప్రేక్షకులకు అందుబాటులోకి రాకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. సంక్రాంతి హైప్లో ఈ టిక్కెట్ రేట్ల నిర్ణయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.